ఆంధ్రప్రదేశ్‌

హోదా ఇవ్వకుంటే రోడ్డెక్కుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ సాక్షిగా బిజెపి హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక హోదా ఇచ్చితీరాలని ఎపిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం అన్నివర్గాల వారిని, అధికారులను, ప్రజాప్రతినిధులను ఏకతాటిపైకి తెస్తామని ఆయన ప్రకటించారు. అందరితో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. కేవలం ప్రత్యేక హోదానే కాకుండా ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం అవసరమైన నిధులు, లోటు బడ్జెట్ భర్తీ, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి సహాయాలు కూడా కేంద్రం చేయాలన్నారు. ప్రత్యేక హోదా అంశం రాజకీయ వ్యవస్థకు సంబంధించిందని, అందుకనే రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రాజకీయ బలం చాలని పక్షంలో తాము కూడా హోదా కోసం రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు. తాము రోడ్లపైకి వస్తే రాష్ట్రం మరింతగా నష్టపోతుందని, అందుకని తప్పనిసరైతేనే పోరాడతామన్నారు. రాజకీయ వ్యవస్థ జీరో అయినప్పుడు తాము రంగంలోకి దిగుతామని ఆయన తెలిపారు. ఆర్థిక విధానాలపై సెప్టెంబర్ 2న ఉద్యోగులు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెకు ఏపి జాక్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సెప్టెంబర్ 28, 29 తేదీల్లో మండల స్థాయిలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు అశోక్‌బాబు ప్రకటించారు. విలేఖర్ల సమావేశంలో సంఘం నేతలు పాల్గొన్నారు.