ఆంధ్రప్రదేశ్‌

జారిపడిన మిగ్ 29కె ఆయిల్ ట్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 29: భారత నౌకాదళానికి చెందిన సూపర్ సోనిక్ యుద్ధ విమానం మిగ్ 29కె ఆయిల్ ట్యాంక్ విశాఖ సిఐఎస్‌ఎఫ్ క్వార్టర్స్ వద్ద జారిపడింది. రోజువారీ విన్యాసాల్లో భాగంగా విశాఖ ఐఎన్‌ఎస్ డేగా నుంచి సోమవారం ఉదయం బయలుదేరిన మిగ్ 29కె ఆయిల్ ట్యాంక్ ఒకటి ప్రమాదవశాత్తూ రన్‌వేపై జారి పడగా, విమాన బరువులో సమతౌల్యం నిమిత్తం పైలెట్ రెండో ఆయిల్ ట్యాంక్‌ను జారవిడిచారు. అనంతరం మిగ్ 29కెను ఐఎన్‌ఎస్ డేగా వద్ద సురక్షితంగా కిందకు దించారు. ఈ సంఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటన విశాఖలో సంచలనం రేకెత్తించింది. పైలెట్ల శిక్షణలో భాగంగా గోవా స్క్వాడ్రన్‌కు చెందిన మిగ్ 29కె విమానాలు తరచు తూర్పునౌకాదళ ప్రధాన కేంద్రం వస్తుంటాయి. దీనిలో భాగంగానే మిగ్ 29కె ఐఎన్‌ఎస్ డేగా నుంచి బయలుదేరింది. మిగ్ 29కె విమానం రెండు రెక్కల్లో 400 లీటర్ల ఇంథనంతో రెండు ఆయిల్ ట్యాంకర్లు ఉంటాయి. మిగ్ 29కె ఐఎన్‌ఎస్ డేగా నుంచి బయలుదేరుతున్న సమయంలోనే ఒక ఆయిల్ ట్యాంక్ జారి పడిపోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పైలెట్ విమానం బరువును సమతౌల్యం చేస్తూ రెండో ట్యాంక్‌లో ఉన్న ఇంథనాన్ని పూర్తిగా ఖర్చు చేసే ప్రయత్నం చేశారు. ఇంధనం ఖర్చయిన తరువాత ట్యాంక్‌ను కిందకు జారవిడిచే ప్రయత్నం చేయగా, అనుకోకుండా అది సిఐఎస్‌ఎఫ్ క్వార్టర్స్ వద్ద కింద పడింది. గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో పయనించే మిగ్ 29కె ఆయిల్ ట్యాంక్ వాస్తవానికి బంగాళాఖాతంలో పడాల్సి ఉంది. అనుకోకుండా జనావాస ప్రాంతంలో కిందకు పడింది. జరిగిన సంఘటనపై సిఐఎస్‌ఎఫ్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ట్యాంక్ నిర్జన ప్రదేశంలో కిందకుపడిందని, అదే జనసమ్మర్ధ ప్రాంతంలో పడి ఉంటే ప్రాణ నష్టం సంభవించేది. జరిగిన సంఘటన నౌకాదళానికి చెందగా, కేంద్ర భద్రత దళాల క్వార్టర్స్ కావడంతో ఇతరులెవరినీ ప్రమాదం జరిగిన ప్రాంతానికి అనుమతించలేదు.