ఆంధ్రప్రదేశ్‌

ఆలయాల్లో రాజకీయాలకు తావులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 9: అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. అంతకు ముందు దేవాలయాల్లో రాజకీయాలకు తావులేకుండా ఎన్నికల ప్రచారంలో అర్చకులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ అర్చక సమైక్య, బ్రాహ్మణ సంఘాల నేతలు బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలుసుకుని వినతిపత్రం అందజేశారు. దీంతో అర్చకుల సమస్యల పరిష్కారంపై చర్చించాల్సిందిగా దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రి వెలంపల్లి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు అజయ్ కల్లం, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్, కమిషనర్ పద్మ, టీటీడీ జేఈఒ బసంత్‌కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులతో కలసి అర్చక, బ్రాహ్మణ సమాఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి 13 జిల్లాల నుంచి వచ్చిన బ్రాహ్మణ సంఘాల నాయకులు, అర్చకులు హాజరయ్యారు. ప్రభుత్వం గతంలో జారీచేసిన జీవో 76ను అమలు చేయాలని అర్చక ప్రతినిధులు మంత్రిని కోరారు. ధార్మిక సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అర్చకుల సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీనిపై పరిశీలనకు సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ భూములు, ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారసత్వ హక్కుల ప్రకారం అర్చకత్వం కొనసాగింపుపై చర్యలు తీసుకుంటామన్నారు. పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా అర్చకత్వం నిర్వహించే విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కనీస ఆదాయంలేని దేవాలయాలకు అర్చక గౌరవ వేతనాన్ని రూ. 5వేల నుంచి 10వేలకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అర్చక సంఘాల నేతలు విజ్ఞప్తి చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు. రూ. 10వేలుగా ఉన్న భృతిని 16,500కు పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 16 వందల దేవాలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలులో ఉందని, దీన్ని 3600 దేవాలయాలకు వర్తింప చేసేందుకు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. డీడీఎస్ స్కీమ్ కింద అందిస్తున్న రు. 5వేల వేతనాన్ని 10వేలకు పెంచే విషయం పరిశీలనలో ఉందన్నారు. శాశ్వత ప్రాతిపదికన ధార్మిక పరిషత్, అర్చక సంక్షేమ మండలి ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులకు హెల్త్‌కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయ సముదాయంలో ఉన్న అర్చక సంక్షేమ భవనాన్ని విస్తృతం చేస్తామని మంత్రి వెల్లంపల్లి హామీ ఇచ్చారు.
*చిత్రం... అర్చకుల సమస్యలపై సమీక్షిస్తున్న మంత్రి వెలంపల్లి, అధికారులు