ఆంధ్రప్రదేశ్‌

పథకాల పేర్ల మార్పుతో జగన్ గారడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 9: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరో గారడీకి తెరలేపారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు చేయాల్సిన పనులను ప్రభుత్వ సిబ్బందితో చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఇదేనా విధి నిర్వహణ అంటూ విరుచుకుపడ్డారు. బుధవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టీఆర్ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. కంటివెలుగుతో జగన్మోహనరెడ్డి కనికట్టు చేస్తున్నారని, ఇది మరో జగన్మాయ అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పెట్టి 67 లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు, చికిత్సలు నిర్వహించి, 3 లక్షల మందికి కళ్లజోళ్లను అందించామన్నారు. అలాంటిది ఇప్పుడు దానినే కంటి వెలుగుగా మార్చి ప్రజల కళ్లుగప్పాలని చూడటం వైసీపీ ప్రభుత్వ దివాలాకోరు తనానికి నిదర్శనమని విమర్శించారు. పోలీసులు, రవాణశాఖ సిబ్బంది పోటీపడి మరీ ఆటోలకు జగన్ స్టిక్కర్లు అతికించడం నవ్వుల పాలైందని, వారి అత్యుత్సాహాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న భూమా అఖిలప్రియను అణగదొక్కేందుకే ఆమె భర్త భార్గవరామ్‌పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం కింద రాష్ట్రంలో నిర్వహించిన పనులకు కేంద్రం ఇచ్చిన నిధులు మూడు రోజుల్లో విడుదల చేయాలని, లేదా 12 శాతం వడ్డీతో సహా కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులు ఏమయ్యాయని, దేనికి మళ్లించారో చెప్పాలన్నారు.
పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులా?
గ్రామ సచివాలయాలు, పంచాయతీ భవనాలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడమేంటంటూ నిలదీశారు. ప్రభుత్వ కార్యాలయాలకు, పార్టీ రంగులు వేయడం దేశంలో ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని స్పష్టంచేశారు. టీడీపీ నేతల రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని, అటు రాజకీయం గా ఇటు న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఛలో ఆత్మకూరు ఉద్యమంతో వైసీపీ ప్రభుత్వ వేధింపులను ప్రజాకోర్టులో ఎండగట్టగలిగామని, సోషల్ మీడియా కార్యకర్తలపై వైసీపీ వేధింపులను, అక్రమ కేసులను నిగ్గదీశామన్నారు. 16 కేసులు, 52 ఆరోపణలు ఉన్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తీవ్ర నేర చరిత్ర ఉన్న ఇతర వైసీపీ నేతలపైనా ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏనాడూ ఈ విధంగా రాజకీయ వేధింపులకు పాల్పడలేదన్నారు. చింతమనేని ప్రభాకర్‌పై వరుస కేసులు నమోదు చేస్తూ అరెస్ట్‌లు చేసి నెలలు తరబడి జైలులో పెడతారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అప్పులు ఇచ్చేందుకు పోటీపడిన ఆర్థికసంస్థలు, నేడు భయపడి పారిపోవడానికి మీ నిర్వాకాలు కారణం కాదా అంటూ ప్రశ్నించారు. ముఖ్య నేతల భేటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కరణం బలరామ్, గద్దె రామ్మోహనరావు, సుజయ కృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు జిల్లాల పర్యటన
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి జిల్లాల పర్యటన ఖరారైంది. బుధవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతల భేటీలో ఏ ఏ జిల్లాల్లో పర్యటించాలనే అంశాలపై చర్చించారు. గురు, శుక్రవారాల్లో విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. 14,15 తేదీల్లో నెల్లూరు జిల్లాలోనూ, 21, 22 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలోనూ పర్యటిస్తారు. ఈ మూడు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి, పార్టీ బలోపేతంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు సమాలోచనలు చేస్తారు.
*చిత్రం... పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు