ఆంధ్రప్రదేశ్‌

నాటుసారాపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 9: దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో భాగంగా రాష్ట్రంలో నాటుసారా తయారీపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఇక ఉక్కుపాదం మోపబోతున్నది. ఇందుకు అవసరమైన నూతన వాహనాలను తక్షణం కొనుగోలు చేయడంతో పాటు నెలవారీ అవరమైన ఇంధనం, నిర్వహణ ఖర్చులు భరించేలా చర్యలు చేపట్టనున్నారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ల సరిహద్దులను పునర్‌వ్యవస్థీకరించి మూడు, నాలుగు మండలాలకే వాటి పరిధిని పరిమితం చేయనున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సయిజ్ మంత్రి కే నారాయణస్వామి బుధవారం విజయవాడ కమిషనర్ కార్యాలయంలో జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సహకారంతో నాటుసారాను అరికట్టాలని నిర్ణయించారు. అన్ని మద్యం తయారీ కంపెనీల్లో పనిచేసే దినసరి వేతన ఉద్యోగులకు కార్మిక చట్టం ప్రకారం వేతనాలు ఇప్పించనున్నారు. ఎక్సైజ్ చెక్‌పోస్టులను బలోపేతం చేయనున్నారు. ముఖ్యంగా నాటుసారా తయారు చేసే వారిని గుర్తించి వారిని ఆర్థికంగా బలపర్చడానికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా జీవనోపాధి కల్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, కమిషనర్ ఎంఎం నాయక్, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్, డిస్టలరీస్ జాయింట్ కమిషనర్ దేవకుమార్ ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.