ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ ఎమ్మెల్యేలకు వాటాలేసి పంచుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 9: వైసీపీ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో పోటీలు పడి మరీ దందాలు చేస్తూ, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటే వారి మధ్య జగన్మోహనరెడ్డి మధ్యవర్తిత్వం నెరుపుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇసుక పంచాయతీలు చేస్తూ వైసీపీ అవినీతి సామ్రాజ్యానికి వాటాలు వేసి పంచుతున్నారని ఆరోపించారు. బుధవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టీఆర్ భవన్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య కార్యకర్తలు, నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ఆగడాలు రోజురోజుకీ పెచ్చుమీరుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మధ్యవర్తిగా చేసి పంచాయతీలు, ఇసుక దందాలు, భూకబ్జాల ద్వారా వచ్చిన సొమ్మును వాటాలు వేసి పంచుతున్నారని ఆరోపించారు. ఒక మహిళా అధికారి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే దాడిచేసి కరెంట్ కట్ చేయించడం, తాగునీటి సరఫరా నిలిపి వేయించడం, చెత్తంతా తెచ్చి వెదజల్లడం, పాములు, జెర్రులు వేస్తామని బెదిరించడం వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. తన ఫిర్యాదు తీసుకునేందుకు అర్ధరాత్రి ఓ మండల అధికారిణి పోలీసుస్టేషన్ ఎదుట ఎనిమిది గంటలు ఆందోళన చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. తరువాత బెయిలబుల్ సెక్షన్లు పెట్టి కేవలం రెండు గంటల్లోనే దర్జాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిని విడుదల చేయడం రాష్ట్రంలో తాజా ఉదాహరణగా పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఒకలా, పదవిలో ఉన్నప్పుడు ఒకలా?
నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ రాష్ట్ర ప్రజలకు చెబుతూ 23 రోజుల క్రితం గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో 50 మంది చనిపోయి, మరో 10 మంది ఆచూకీ దొరక్క వాళ్ల కుటుంబ సభ్యులు అయోమయ స్థితిలో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు కనిపించడంలేదా అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బోటు ప్రమాదం జరిగితే పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ నానా యాగీ చేసిన జగన్ చివరకు పదవిలోకి వచ్చాక అలాంటి పడవ ప్రమాదం జరిగితే ఏరియల్ సర్వేతో సరిపెట్టుకొని తనకేం పట్టనట్లు వ్యవహరించడం సరికాదని వెంకట్రావు విమర్శించారు.
వైసీపీ నేతలకు కల్పతరువుగా ఇసుక
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం వైసీపీ నేతలకు కల్పతరవుగా మారి, దాని అనుబంధ రంగాలైన రియల్ ఎస్టేట్, శ్రామిక రంగాలను కుదేలు చేసిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. బుధవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో కలిసి సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడారు. రాష్ట్రంలోని అతి ముఖ్యమైన సహజ వనరైన ఇసుకను సామాన్యులకు అందకుండా చేసిన ప్రభుత్వం వైసీపీ నేతలకు మాత్రం ముఖ్యమైన ఆదాయ వనరుగా మార్చేసిందన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ, పారిశ్రామిక రంగాల పురోభివృద్ధికి అత్యంత అవసరమైన ఇసుక లభించకపోవడంవల్ల ఆయా రంగాలు తిరోగమన దిశలో పయనిస్తున్నాయన్నారు.
పంపకాల్లో తేడాలు సరిదిద్దేందుకే ఎమ్మెల్యేల పంచాయతీ
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పంచాయతీ జరిపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర నేతలు వర్ల రామయ్య, అబ్దుల్ అజీజ్‌లు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వచ్చిన పంపకాల తేడా సరిదిద్దేందుకు వైసీపీ అధినేత వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఎంపిడిఓను బెదిరించి ఆమె ప్రాణహానితో భయపడే పరిస్థితుల్లో తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదు చేయకుండా జాప్యం చేశారని ఆరోపించారు.