ఆంధ్రప్రదేశ్‌

నేటి నుండి సీపీఎం నిరసన కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు వరాలు, సామాన్యులకు భారాలు మోపుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా గురువారం నుండి ఈనెల 16వ తేదీ వరకూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. బుధవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో మైనింగ్ రంగంలోని కార్మికులు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున సమ్మెలు చేస్తున్నాయన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచడం ద్వారానే వస్తు తయారీ రంగం, పారిశ్రామిక రంగాల్లో కదలిక తీసుకురావచ్చనే విషయాన్ని మోదీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రిజర్వ్ బ్యాంకు నిధుల నుండి లక్షల కోట్ల రూపాయాలను ప్రభుత్వం వ్యవసాయం, పరిశ్రమలకు ఖర్చు పెట్టడం ద్వారా పెద్దఎత్తున ఉపాధి కల్పించవచ్చనే వాస్తవాన్ని కూడా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రభుత్వ పనులకు పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేయాలని, కార్మికునికి కనీస వేతనం నెలకు రూ.21వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యలు నిరోధించాలని, రైతుల రుణమాఫీ చేయాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, దేశమంతా వృద్ధాప్య పింఛన్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నిరసనను చేపడుతున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ ఆందోళనకు ప్రజలంతా కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 10వ తేది నుండి 16 వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేపడతామని, 16న రాష్టవ్య్రాప్తంగా రాస్తారోకోలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.