ఆంధ్రప్రదేశ్‌

తెప్సోత్సవం... భక్తజన పరవశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, అక్టోబర్ 8: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు మంగళవారం రాత్రి నిర్వహించిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల తెప్పోత్సవాన్ని వీక్షించి భక్తజనం పరవశించిపోయింది. ఆలయ ఈశాన్య భాగంలో గల పుష్కరిణిలో అత్యంత వైభవంగా తెప్సోత్సవాన్ని నిర్వహించడంతో ఇటు భక్తులు ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు. ఓ వైపు విద్యుత్ దీపాల అలంకరణలు, మరోవైపు బాణసంచా వెలుగుల మధ్య తెప్పోత్సవం కన్నులపండుగగా కొనసాగింది. ఈ తెప్పోత్సవ అలంకరణ కోసం 3వేల కిలోల పుష్పాలు, పలు రకాల విడిపూలను సేకరించారు.
దసరా మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీభ్రమరాంబదేవి అలంకరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అష్ట్భుజాలు కలిగిన దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిదా ధరించి దర్శనం ఇచ్చింది. కాగా వాహన సేవల్లో భాగంగా స్వామి అమ్మవార్లు నందివాహనంపై విహరించారు. అర్చకులు, వేద పండితులు, ఈఓ రామారావు అలంకార సేవలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శమీవృక్షం వద్దకు అలంకృత స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజన నైవేద్యాలను సమర్పించారు.
ఈసందర్భంగా వివిధ కళాకారుల విన్యాసాలు, మహిళల కోలాటాలు, విచిత్ర వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అలాగే లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ బుధవారం సాక్షిగణపతి, వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రామారావు, ఏఈఓలు కృష్ణారెడ్డి, మల్లయ్య, శ్రీశైలం ప్రభ సంపాదకులు డాక్టర్ అనిల్‌కుమార్, సీఆర్‌ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా యాగశాలలో పూర్ణాహుతి
దసరా ఉత్సవాలలో భాగంగా చివరిరోజు దేవాలయాల్లో ఈఓ రామారావు ప్రత్యేక పూజలు చేసి చండీహోమం, రుద్రహోమం చేశారు. యాగశాలలో పూర్ణాహుతి చేసి కలశోధ్వశాన, వసంతోత్సవం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలను సమర్పించారు. మల్లికా గుండం వద్ద చండీశ్వరునికి ఆవాభృగ స్నానం చేయించారు.