ఆంధ్రప్రదేశ్‌

సీమలో తగ్గని భానుడి ప్రతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 25 : రాయలసీమలో భానుడి ప్రతాపం ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. సీమవ్యాప్తంగా జిల్లాల్లో వేడిగాలులు, ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనంతపురం జిల్లాలో శుక్రవారం సగటు ఉష్ణోగ్రత 40.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా అత్యధికంగా అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో 47.4 డిగ్రీలు నమోదైంది. జిల్లా కేంద్రంలో మాత్రం 39.8 డిగ్రీలు నమోదైంది. జిల్లాలోని 62 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 40.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, కర్నూలు నగరంలో 40.5, అత్యధికంగా బేతంచర్లలో 43.9 డిగ్రీల నమోదైంది. జిల్లాలోని 96 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదు కాగా కడప నగరంలో 41.4, అత్యధికంగా కొండాపురంలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని 48 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో 40 డిగ్రీల సెల్సియస్ పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ వ్యాప్తంగా మరోరెండు రోజుల పాటు ఇదే రకమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ వాతావరణ విభాగం శాస్తవ్రేత్త మల్లీశ్వరి తెలిపారు.