ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌ఏఎస్‌తో నిరంతర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 13: రాష్ట్రంలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ఏపీ ట్రాన్స్‌కో కసరత్తు ప్రారంభించింది. ఆ దిశగా కీలక నిర్ణయాలు చేపట్టింది. సరఫరా వ్యవస్థలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సబ్‌స్టేషన్ ఆటోమేషన్ సిస్టం (ఎస్‌ఏఎస్)ను త్వరలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతరాయాల్లేని విద్యుత్‌ను సరఫరా చేసి వినియోగదారులకు ఉత్తమ సేవలందించాలనే లక్ష్యంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీజీసీఐఎల్) సాయంతో ప్రాథమికంగా 400 కేవీ సబ్‌స్టేషన్లలో దశల వారీగా పూర్తి స్థాయిలో ఆటోమేషన్‌ను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సబ్ స్టేషన్ ఆటోమేషన్ సిస్టం (ఎస్‌ఏఎస్) వల్ల నిర్వహణ వ్యవస్థ సామర్థ్యాలు పెరగటంతో పాటు సబ్ స్టేషన్ నిర్వహణలో సాధారణంగా ఎదురయ్యే లోపాలు కూడా తగ్గుతాయని భావిస్తోంది. సరికొత్త ఎస్‌ఏఎస్ వ్యవస్థ ఏర్పాటుపై ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆదివారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ సమీక్ష జరిపారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను అందించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉంటేనే పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమని తద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమం కాగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీకి మద్దతిచ్చేందుకు
ముందుకొచ్చిన సీజీసీఐఎల్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది.
సరఫరా పంపిణీ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసేందుకు ఏపీ ట్రాన్స్‌కో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకునేందుకు సరికొత్త విధానాలను ప్రవేశపెడుతోందని శ్రీకాంత్ వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఎస్‌ఏఎస్.. నమ్మకమైన విద్యుత్ సరఫరాకు వినియోగదారులను సంతృప్తి పరిచేలా సేవలందించేందుకు దోహదపడ గలదన్నారు.
ఏపీ ట్రాన్స్‌కో దేశంలోనే అత్యుత్తమ సరఫరా వ్యవస్థల్లో ఒకటని చెప్పారు. రాష్ట్రంలో అందరికీ నిరంతరాయ విద్యుత్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కోకు భారీ సరఫరా నెట్‌వర్క్ (28.385) సర్క్యూట్ కిలోమీటర్లు (సీకేఎం), 332 ఎక్స్‌ట్రా హైటెన్షన్ సబ్ స్టేషన్లు) ఉంటుందని వివరించారు.
సీజీసీఐఎల్ దేశవ్యాప్తంగా 765కేవీ, 400 కేవీ లైన్లు, సబ్‌స్టేషన్లు నిర్వహిస్తోందని.. అందులో 400 కేవీ సబ్‌స్టేషన్లన్నీ దాదాపుగా ఆటోమేషన్‌తోనే నిర్వహిస్తోందని శ్రీకాంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ట్రాన్స్‌కో కూడా 400 కేవీ సబ్‌స్టేషన్లలో దశల వారీగా పూర్తి స్థాయిలో ఆటోమేషన్‌ను అమలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆటోమేషన్ వల్ల వినియోగదారులకు అంతరాయాల్లేని కరెంట్ సరఫరా చేసేందుకు అవసరమైన నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. ఎస్‌ఏఎస్‌లు సబ్‌స్టేషన్ల నియంత్రణ, పరిరక్షణ, పర్యవేక్షణకు ఉపయోగపడతాయి. అదే విధంగా విద్యుత్ వ్యవస్థపై విశ్వాసం, లోపాలను సరిదిద్దే సామర్థ్యాలు మెరుగవుతాయి. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించటంలో ఉపకరిస్తాయని వివరించారు. ఎస్‌ఏఎస్ విధానాలపై చర్చించేందుకు సీజీసీఐఎల్ ఉన్నతాధికారులతో ఏపీ ట్రాన్స్‌కో త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఎస్‌ఏఎస్ వల్ల ఆర్థికంగా అనేక లాభాలు ఉంటాయని ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు చెప్పారు. విద్యుదుత్పత్తి ఖర్చు, నిర్వహణ, సరఫరా నష్టాలను తగ్గిస్తుందని, పంపిణీ నెట్‌వర్క్‌లో పెట్టుబడులు తగ్గించటంలో దోహదపడుతుందన్నారు. ప్రధానంగా వినియోగదారుల సంతృప్తి స్థాయిని పెంచుతుందని తెలిపారు. సబ్ స్టేషన్ ఆటోమేషన్ సిస్టం సర్క్యూట్ బ్రేకర్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, రిలేస్ వంటి స్మార్ట్ విద్యుత్ ఉపకరణాలతో సమీకృతమై ఉంటుందన్నారు. ఇవన్నీ ఎస్‌ఏఎస్ పర్యవేక్షణా సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) వ్యవస్థ, అలార్మ్ ప్రాసెసింగ్ వంటి విధానాలతో సబ్‌స్టేషన్, ఫీడర్ల కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. స్కాడా టెక్నాలజీ (ఎస్సీఏడీఏ) నిర్వహణ వ్యయాన్ని చాలా వరకు తగ్గిస్తుందని అలాగే వ్యవస్థ పనితీరును మెరుగుపరచగలదని జేఎండీ (విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) కె వెంకటేశ్వరరావు తెలిపారు. స్కాడా టెక్నాలజీ కచ్చితమైన సమాచారాన్ని సేకరించడంతో పాటు నివేదిక కోసం దాన్ని నిల్వ చేయటం, సమస్యల పరిష్కారాలు, నిర్వహణ సూచనల కోసం వినియోగించుకుంటుందని వివరించారు.
విద్యుత్ సంస్థలు మెరుగైన ప్రణాళికలు రూపొందించుకునేందుకు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఎస్‌ఏఎస్ వినూత్న ప్రక్రియగా ఉపకరిస్తుందని తెలిపారు.