ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 1: సరిగ్గా 15 మాసాల తర్వాత ప్రకాశం బ్యారేజీ వద్ద కనిపించిన జలకళ మురిపం సరిగ్గా 24 గంటలు కూడా నిలవలేదు. ఎగువనున్న కట్టలేరు, మునేరు ఇతర వాగులు పొంగి పొరలటం వలన సంభవించిన వరద తాకిడికి బుధవారం ఉదయం 20 గేట్లను ఒక అడుగు మేర పైకి ఎత్తి 15 వేల క్యూసెక్కుల చొప్పున సముద్రంలోకి వదలాల్సి వచ్చింది. వరద తాకిడి నిలిచిపోవటంతో గురువారం ఉదయం గేట్లన్నీ మూసివేశారు. మొత్తంపై ఒక టిఎంసి నీరు సముద్రంలో వెళ్లింది. 15 మాసాల క్రితం కొన్ని రోజుల పాటు మొత్తం 70 గేట్లు పైకి ఎత్తి 70 వేల క్యూసెక్కులు చొప్పున సముద్రంలోకి వదిలారు. ఆ తర్వాత దిగువకు నీరు వెళ్లకపోవటం అటుంచి బ్యారేజీ కనీస నీటిమట్టం 12 నుండి మూడు అడుగుల వరకు తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం తూర్పు డెల్టా కాల్వలకు ఆరు వేలు, పశ్చిమ డెల్టా కాల్వలకు 2 టిఎంసిలు, గుంటూరు ఛానెల్‌కు 200 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.