ఆంధ్రప్రదేశ్‌

మీ గ్రామ సమస్యలు చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 13: సింగపూర్‌లో మీరు నివసిస్తున్న ప్రాంతంలో గానీ, లేదా భారతదేశంలో మీరున్న ఊర్లలో గానీ ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో చెప్పి పరిష్కరిస్తానని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సింగపూర్‌లోని ఎన్‌ఆర్‌ఐలకు భరోసా ఇచ్చారు. సింగపూర్‌లో ఆదివారం టీటీడీ నిర్వహించిన శ్రీనివాస కల్యాణం మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడున్న ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలు, నవరత్నాల గురించి ఆయన వివరించారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయాల పేరుతో అమలు చేస్తున్న విధానాన్ని వివరించారు. ఈక్రమంలో దాదాపు లక్షల సంఖ్యలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా పారదర్శకంగా ఉద్యోగకల్పన చేశారో వివరించారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా పది మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టులతో ఇండియాకు రావాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. పెట్టుబడులకు, వౌలిక వసతులకు ఎలాంటి ఢోకా లేదన్నారు.
ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనే ఆలోచన నుండి మన దేశంలో, మన రాష్ట్రంలోనే ఉద్యోగాలను కల్పించే యూనిట్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలతో ప్రవాస భారతీయులు కంకణబద్ధులు కావాలని విజ్ఞప్తి చేశారు. మీ ప్రతిభ, మీ సంపద, మీ మానవీయ విలువలు ఇక్కడున్న ప్రవాస భారతీయుల సొంత ఊళ్లలో ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఇందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. మీకు జన్మస్థలాల్లో గానీ, మీ నియోజకవర్గంలో గానీ ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అయితే మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మన సంప్రదాయాలు, సంస్కృతులను కాపాడటం కోసం ఇక్కడున్న ప్రవాస భారతీయలు చేస్తున్న కృషి అభినందనీయమని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాన్నారు. ఈ సమావేశంలోఎన్‌ఆర్‌ఎస్‌సీఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షులు బొమ్మా శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ ప్రకాష్‌రెడ్డి, సభ్యులు వేణుగోపాల్‌రెడ్డి, సత్య, నాగరాజు, సంతోష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, లీలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.