ఆంధ్రప్రదేశ్‌

అన్నమయ్య గీతాలను ఆలపించిన జిల్లా కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 13: పట్టణంలో విజయనగరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఆదివారం ఉదయం ఆనందగజపతి ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ నేను సైతం అంటూ తనదైన శైలిలో అన్నమాచార్య కీర్తనలు, భక్తిగీతాలను ఆలపించారు. విజయనగరం వైభవం ఉట్టిపడేలా శ్రీవారి స్వచ్చంద సంస్ధ వ్యవస్థాపకులు, సంగీత దర్శకుడు ఎం.్భష్మ సారధ్యంలో అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. అనంతరం రాత్రి జరిగిన గీతాలాపనలో కలెక్టర్ హరి జవహర్‌లాల్ స్వచ్ఛ విజయనగరం మీద గీతాన్ని ఆలపించారు. విజయనగరం సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింభించేలా కార్యక్రమం కొనసాగిందని సంగీత ప్రియులు కొనియాడారు.ఈ సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు పలువురిని అలరించాయి.
*చిత్రం... అన్నమయ్య గీతాలను ఆలపిస్తున్న జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్