ఆంధ్రప్రదేశ్‌

కుటుంబ కలహాలతో భార్య, అత్తపై కత్తితో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, సెప్టెంబర్ 1: కుటుంబ కలహాల నేపధ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణ పరిధిలోని 19వ వార్డు దగ్గువారి వీధిలో గురువారం మధ్యాహ్నం బోదంకి నరసింహమూర్తి తన భార్య వరలక్ష్మి, అత్త మాచవరపు అచ్చాయమ్మలపై కత్తితో దాడి చేశాడు. అనంతరం నరసింహమూర్తి కూడా కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వరలక్ష్మి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నరసింహమూర్తిని 108 అంబులెన్సులో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వరలక్ష్మి (32) మృతి చెందినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అత్త అచ్చాయమ్మను చికిత్స నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా మెరుగైన వైద్యానికి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పట్టణ ఎస్‌ఐ ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇలావుండగా డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చాయమ్మను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వరరావు విలేఖరులతో మాట్లాడుతూ కుటుంబ కలహాల కారణంగానే నరసింహమూర్తి భార్యపైన, అత్తపైన కత్తితో దాడి చేసినట్టు తెలిపారు.
సెంటరింగ్ పనులు చేసుకునే నరసింహమూర్తి హైదరాబాద్‌లో తన భార్య, వరలక్ష్మి పిల్లలతో ఉంటున్నాడన్నారు. వ్యసనాలకు బానిస కావడంతో నరసింహమూర్తి తరచూ భార్యను కొడుతూ ఉండటంతో వరలక్ష్మి పిల్లలను తీసుకుని కొవ్వూరు వచ్చేసిందని తెలిపారు. గురువారం నరసింహమూర్తి భార్యను తనతో రమ్మని ఇంటికి వెళ్లి అడగగా ఆమె నిరాకరించడంతో ఆమెపైన, అత్తపైన కత్తితో దాడికి పాల్పడినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఆత్మహత్యకు పాల్పడిన నరసింహమూర్తి, అలాగే దాడిలో గాయపడిన అచ్చాయమ్మ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు డిఎస్పీ తెలిపారు. నరసింహమూర్తితో వరలక్ష్మికి 16 సంవత్సరాల క్రితం వివాహమైందని, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని చెప్పారు.

చిత్రాలు..భర్త దాడిలో గాయపడిన వరలక్ష్మి.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు