ఆంధ్రప్రదేశ్‌

వచ్చే మార్చి నుంచే ‘టెన్త్’లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: టెన్త్ పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి నుంచి సవరించిన విధానంలో పరీక్షలు నిర్వహించనుంది. కంటిన్యువస్ అండ్ కాంప్రహెన్సివ్ ఈవాల్యుయేషన్ విధానం (సీసీఈఎస్)పై కొన్ని ఆరోపణలు రావడంతో టెన్త్ పరీక్షా విధానంలో సంస్కరణలు అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు మార్కులకు అరమార్కు ప్రశ్నలు పనె్నండు ఉంటాయి. ఎనిమిది మార్కులకు వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు (ఒక మార్కు చొప్పున) ఎనిమిది ఉంటాయి. రెండు మార్కుల షార్టు ఆన్సర్ ప్రశ్నలు పదహారు మార్కులకు ఎనిమిది ఉంటాయి. నాలుగు మార్కుల వ్యాస రూప ప్రశ్నలు 5 మార్కుల చొప్పున 4 ఉంటాయి. 50 మార్కుల ప్రశ్నపత్రానికి సమాధానాలు రాసేందుకు 2.30 గంటల సమయం కేటాయించారు. ప్రశ్న పత్రం చదివేందుకు 15 నిమిషాల సమయం అదనంగా కేటాయిస్తారు. కాంపోజిట్ కోర్సు ఫస్ట్ లాంగ్వేజ్‌కు 3.15 గంటలు, సెకండ్ లాంగ్వేజ్‌కు 3 గంటల సమయం కేటాయించారు. 24 పేజీల సమాధాన పుస్తకాన్ని విద్యార్థులకు సరఫరా చేస్తారు. పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నపత్రాల రూపకల్పనకు ఇప్పటివరకూ డీఈవోలు, జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సహకరించే పద్ధతికి స్వస్తి పలికింది. ఇకపై ప్రభుత్వ పరీక్షల సంచాలకుని సహకారంతో ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ టెన్త్ ప్రశ్నపత్రాల రూపకల్పన బాధ్యత వహిస్తారు. ఎస్‌ఎస్‌సీ మార్కుల జాబితాలో సబ్జెక్టులు, పేపర్ల వారీగా గ్రేడ్‌లను పొందుపరుస్తారు. ఈ మేరకు మార్కుల జాబితా డిజైన్‌ను మార్పు చేయాలని ఆదేశించింది.