ఆంధ్రప్రదేశ్‌

నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. కేంద్ర వైఖరిపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. దీంతో పాటు గ్రామ సచివాలయ వలంటీర్లకు వేతనాలు పెంచే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రైతులకు వరి బోర్డు ఏర్పాటు, టమోటా ధరలు, ఇసుక కొరత, మద్యం నూతన విధానంపై సమీక్ష జరగనుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పోలవరం అంశాలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి చుక్కెదురవుతున్న నేపథ్యంలో ఈ రెండు అంశాల పరిష్కారంపై సీఎం జగన్ మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. పీపీఏల వ్యవహారం అంతర్జాతీయంగా పెట్టుబడుల తిరోగమనానికి దారితీస్తోందని ఇటీవల ప్రధానమంత్రి మోదీ కూడా అభిప్రాయపడినట్లు వినికిడి. గత కొద్ది రోజుల
క్రితం ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో భేటీ అయిన సంగతి విదితమే. అయితే పీపీఏలపై చర్చించేందుకు ప్రధానమంత్రే స్వయంగా జగన్‌ను ఢిల్లీకి పిలిపించినట్లు చెబుతున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ కోర్టు కేసుల పరిష్కారం, తదితర అంశాలు మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు రానున్నట్లు తెలిసింది. రైతు భరోసా ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని సీఎం జగన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పథకంలో ప్రధాని పేరును చేర్చినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రధాని పేరును చేర్చటం ద్వారా కేంద్రంతో సాన్నిహిత్యానికి సీఎం జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు భరోసా అమలుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.