ఆంధ్రప్రదేశ్‌

అటవీ శాఖలో 2,600 పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2,600 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారని ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే కంపా నిధులు రూ.323 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 23 శాతం మాత్రమే అడవులు ఉన్నాయని.. కేంద్ర చట్టాల మేరకు 33 శాతం పచ్చదనం ఉండాలని అన్నారు. అయితే రాష్ట్రంలో పచ్చదనం 17 శాతంగా ఉందని, మిగిలిన 16 శాతం పచ్చదనాన్ని పెంచేందుకు వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖలో ఖాళీల భర్తీతో పాటు వాహనాల కొరత ఎక్కువగా ఉందని, రూ.40 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు, నిధులు మంజూరు చేసిందన్నారు. కంపా నిధులు రూ.1750 కోట్లుండగా, తొలి దశలో రూ.323 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అటవీ ప్రాంతంలో అటవీ పోలీసు స్టేషన్ల ఏర్పాటు అంశం ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు.