ఆంధ్రప్రదేశ్‌

సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు నిపుణుల కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్రంలో ఖాయిలా పడిన ఆరు సహకార చక్కెర కర్మాగారాలను పునరుద్ధరణకు సాంకేతిక నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వివిధ కారణాల వల్ల ఖాయిలా పడిన సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసం బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలను కేటాయించింది. కడప, శ్రీవేంకటేశ్వర, చిత్తూరు, కొవ్వూరు, అనకాపల్లి, ఎన్వీఆర్ అండ్ ఏడీఆర్ (జంపని) కర్మాగారాల పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, రోడ్ మ్యాప్, పునర్ వ్యవస్థీకరణ, కావలసిన అదనపు కార్మికులు, మరమ్మతులు, యంత్రపరికరాల మార్పు, చెరకు పంట అభివృద్ధికి చర్యలు తదితర అంశాలపై ఈ నిపుణుల కమిటీ నివేదిక అందచేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలో వ్యవసాయ నిపుణుడు బి.గురువా రెడ్డి, వాల్యూ ఇంజనీరింగ్ నిపుణుడు వైవీ చౌదరి, సహకార చక్కెర కర్మాగారాల ఇంజనీరింగ్ నిపుణుడు గోపాలకృష్ణ ఉన్నారు. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక అందచేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
గోనె సంచీల కొనుగోలుకు ..
ఏటికొప్పాక, చోడవరం, తాండవ, బీమసింగిలోని చక్కెర కర్మాగారాలకు అవసరమైన గోనె సంచీలను కొనుగోలు చేసేందుకు కేంద్రీకృత కొనుగోలు కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చెరకు కమిషనర్, ఆయా కర్మాగారాల ఎండీలు, హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డైరెక్టర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ-ప్రొక్రూర్‌మెంట్ విధానంలో కొనుగోలు చేయాలని ఆదేశించింది.
ల్యాబ్ పరికరాల కొనుగోలుకు ..
త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వైఎస్సార్ అగ్రి ల్యాబ్‌లకు అవసరమైన ఏకీకృత డిజిటల్ ఫ్లాట్‌ఫారం, బార్‌కోడ్ యంత్రాలు, కంప్యూటర్లు, ఇతర పరికరాల కొనుగోలు, నిర్వహణను పర్యవేక్షించేందుకు నిపుణుల సాంకేతిక కమిటీని ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో వివిధ విభాగాల నుంచి మరో 10 మంది అధికారులను సభ్యులుగా నియమించింది.
అర్చక శిక్షణా అకాడమీ డైరెక్టర్ నియామకం
ఏపీ అర్చక అకాడమీ డైరెక్టర్‌గా ఏవీఎం కామేశ్వర రావును నియమించింది. ఇప్పటి వరకూ డైరెక్టర్‌గా వ్యవహరించిన రాజగోపాల చక్రవర్తి మృతి కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలు ఉంటారు. ఆగమ సలహా బోర్డు సభ్యునిగా గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బ్రహ్మశ్రీ ఎన్ పెద్ది శివరామ ప్రసాద శర్మ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.