ఆంధ్రప్రదేశ్‌

మావోయిస్టులు మా అదుపులో లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం గణనీయంగా తగ్గిందని, ముఖ్యంగా ప్రజలపై వీరి ప్రభావం ఏ మాత్రం కనిపించటం లేదని రాష్ట్ర డీజీపీ గౌతం దామోదర్ సవాంగ్ అన్నారు. హింస ద్వారా ఏమీ సాధించలేమన్నారు. మావోయిస్టు అరుణ పోలీసుల అదుపులో ఉన్నారనేది పూర్తి అసత్య ప్రచారమన్నారు. తమ అదుపులో మావోయిస్టులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగరంలోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలో జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వస్తున్న ఆరోపణలు నిజం కాదన్నారు. కేసు విచారణ సమర్థవంతంగా, సక్రమంగా సాగుతున్నదన్నారు. రాజకీయ నేతలు మాట్లాడే మాటలను తాము ఏ మాత్రం పట్టించుకోబోమన్నారు. సమాజంలో సామాన్య పౌరులకు పోలీసుస్టేషన్‌లపై ఉన్న అప నమ్మకం, పోలీసులపై ఉన్న అపోహలు, దురభిప్రాయాలను తొలగించి, ఫ్రెండ్లీ పోలీసింగ్ నెలకొల్పేందుకు ఓపెన్ హౌస్ ఒక చక్కని వేదికగా అభివర్ణించారు.
ఓపెన్ హౌస్ అంటే పోలీసు స్టేషన్‌లను ప్రజలు సందర్శించే కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. అక్టోబర్ 21వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందంటూ విధి నిర్వహణలో ఆసువులు బాసిన పోలీసు వీరులను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా వారోత్సవాలను నిర్వహించుకుంటున్నామన్నారు. సమాజంలో పోలీసుల త్యాగాలు, ప్రజలకు రక్షణ, భద్రత కల్పించటంలో పోలీసుల పాత్ర గురించి స్నేహపూర్వక వాతావరణంలో ప్రజలకు ముఖ్యంగా యువత, పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఇక రాష్ట్ర వ్యాప్తంగా తరచూ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొని వివిధ కళాశాలల విద్యార్థులకు బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్‌లు, వివిధ రకాల ఆయుధాల పనితీరు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్, సిటీ సెక్యూర్టీ వింగ్, కమ్యూనికేషన్, ఆక్టోపస్, ట్రాఫిక్, వాటర్ కెనాన్, చేరువ, వజ్రా, ఫాల్కన్ తదితర వాహనాల పాత్ర పనితీరు గురించి వివరించారు.
ముందుగా సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీపీ ద్వారక తిరుమలరావు, జాయింట్ పోలీసు కమిషనర్ డీ నాగేంద్రకుమార్, డీసీపీలు ఎస్ హరికృష్ణ, వీ హర్షవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... ఓపెన్ హౌస్ కార్యక్రమంలో మాట్లాడుతున్న డీజీపీ గౌతం సవాంగ్