ఆంధ్రప్రదేశ్‌

గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 15: రాష్ట్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన గ్రామీణ, పట్టణ గృహనిర్మాణ పథకాలు త్వరితగతిన పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధికి సంబంధించి రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్, మానిటరింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌ఎంసీ) సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చినందున ఆయా క్షేత్ర స్థాయి సిబ్బంది సేవలను పూర్తిగా వినియోగించుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణ పథకాలను వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ, మునిసిపల్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇళ్లులేని ప్రతి కుటుంబానికి సొంతిల్లు నిర్మించే ప్రక్రియలో భాగంగా 25 లక్షల మందికి ఇళ్లు సమకూర్చనున్నందున విడివిడిగా నిర్మించే గృహాలను 40 రోజుల్లోగా, బహుళ అంతస్తుల ఇళ్లు 150 రోజుల్లోగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయంతో పాటు ఇంటి స్థలం లేదా పట్టాను బ్యాంక్‌లో తనఖా పెట్టి కొంత మొత్తం బ్యాంక్ రుణ సౌకర్యం కల్పించడం ద్వారా లబ్ధిదారులు సకాలంలో ఇళ్లు నిర్మించుకునేలా చూడాలని సీఎస్ ఆదేశించారు. సకాలంలో ఇళ్ల నిర్మాణం, రుణాల చెల్లింపు ద్వారా ఆయా లబ్ధిదారులు పొదుపు చర్యలు పాటించే వీలుంటుందని దీనివల్ల ఆర్థికంగా నిలదొక్కుకోగలరనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గృహనిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ పీఎంఏవై పథకం కింద రాష్ట్రంలోని వివిధ అర్బన్ స్థానిక సంస్థలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల్లో సుమారు 6 లక్షలకు పైగా గృహాలను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. అంతకు ముందు ఏపీ టిడ్కో ఎండీ దివాన్ మైదీన్ అజెండాలోని అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చౌటపాలెం వద్ద డిమాన్‌స్ట్రేషన్ హౌసింగ్ ప్రాజెక్ట్ (డీహెచ్‌పీ) కింద సామాజిక హాల్‌తో కూడిన 36 గృహాలను తాత్కాలిక ప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పురపాలకశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం నాంచారయ్య, సీసీఎల్‌ఏ కార్యదర్శి చక్రవర్తి, గృహనిర్మాణ సంస్థ సీఈ మల్లికార్జున, హౌసింగ్ ఇంజనీర్లు పొల్గొన్నారు.