ఆంధ్రప్రదేశ్‌

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నిందితుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: ఓటుకునోటు కేసును నిర్వీర్యం చేయకుండా తెలంగాణ ఏసిబి చిత్తశుద్ధితో దర్యాప్తు చేసి కోర్టు ఆదేశాలను పాటించేందుకు చర్యలు తీసుకోవాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ కేసులో సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని బయటపడాలని ఏపిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి గవర్నర్‌ను కలవడం వెనక మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆకస్మాత్తుగా వచ్చి సమావేశం కావడంపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. రాజ్‌భవన్ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, దీని ప్రతిష్టను నిలబెట్టే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలన్నారు. రాజ్‌భవన్‌ను రాజీ భవనంగా, లాలూచీ భవనంగా మార్చరాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేదా ఏసిబి అధిపతి పాలనలో భాగంగా గవర్నర్‌ను కలిసి ఉండవచ్చన్నారు. ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రావడంతో, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.
ప్రత్యేక హోదాపై చర్చించారా, లేదా ఏ అంశంపై చర్చించారో బిజెపి వెల్లడించాలన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కేంద్రం ఓటుకు నోటు కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో భాగస్వామం వహించరాదన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారన్నారు. ఈ కేసు జరిగి ఏడాది దాటిందని, ఇంతవరకు ఈ కేసులో తెలంగాణ ఏసిబి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విచారించలేదన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీటులో చంద్రబాబు పేరు 31 సార్లు ఉందన్నారు.