ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్ 5నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్ యువతకు ఆర్మీలో ఉద్యోగ అవకాశాలకు ప్రత్యేక ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీ అక్టోబర్ 5 నుండి 15వ తేదీ వరకూ కాకినాడలో జరుగుతుంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన యువతను సోల్జియర్ జనరల్ డ్యూటీ, సోల్జియర్ టెక్నికల్ డ్యూటీ, సోల్జియర్ టెక్నికల్ ఏవియేషన్/ ఆమ్యునేషన్ ఎగ్జామినర్, సోల్జియర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ వంటి పోస్టులకు ఈ ర్యాలీ జరుగుతోంది. ఇందుకోసం ముందుగా యువతను సన్నద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ శిక్షణకు ఎంపికైన వారికి ఉచితంగా నివాసం, భోజనం, మెటీరియల్ అందిస్తామని యువజన సర్వీసుల శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఆయా జిల్లాల సిఇఓలను, మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.