ఆంధ్రప్రదేశ్‌

పవర్ కెనాల్‌కు నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, అక్టోబర్ 16: సీలేరు కాంప్లెక్స్ పరిధిలో డొంకరాయి పవర్ కెనాల్‌కు ఆగస్టు 12న గండి పడింది. దీంతో జెన్‌కో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టినప్పటికీ వర్షాల కారణంగా పనులు సకాలంలో పూర్తి కాలేదు. సీలేరు, డొంకరాయి , పొల్లూరు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. సీలేరులో పీక్ లోడ్ అవర్స్‌లో కొద్దిపాటి విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే చేయగలిగారు. డొంకరాయి విద్యుత్ కేంద్రం పూర్తిగా మూతపడింది. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి వర్షాల కారణంగా పిల్లవాగుల నుండి వచ్చే నీటితో పాటు శాడీల్ డ్యామ్ నుండి వచ్చే లీకేజ్ వాటర్‌ను కలుపుకుని పీక్ లోడ్ అవర్స్‌లో రోజుకు ఒక ఎంయూ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేయగలిగారు. దీంతో జెన్‌కో ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షక ఇంజనీర్లను నియమించి పవర్ కెనాల్ గండిని బుధవారం నాటికి పూర్తి చేసారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నబాబు చేతుల మీదుగా పవర్ కెనాల్‌కు నీటిని విడుదల చేసినట్లు ఎస్‌ఈ గోపాల్‌కృష్ణ, ఈఈ రమేష్ తెలిపారు.
*చిత్రం...పవర్ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తున్న అధికారులు