ఆంధ్రప్రదేశ్‌

కరవుపై రెయిన్ గన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 2:‘గడచిన ఆరేడు రోజులుగా కరవుతో యుద్ధం చేశాం. యుద్ధంలో చిన్నచిన్న దెబ్బలు తగిలాయి. అయితే అంతిమ విజయం మనదే. ఈ రోజు అదే జరిగింది. దీంతో కరవును జయిస్తామన్న భరోసా వచ్చింది. భవిష్యత్తులో కరవును జయిస్తాం. ఎలాంటి సందేహం లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో ఎండుతున్న వేరుశెనగ పంటను కాపాడేందుకు రెయిన్‌గన్ల ద్వారా రక్షక తడులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సిఎం గత ఐదు రోజులుగా అనంతపురం జిల్లాలోనే మకాం వేసి స్వయంగా పర్యవేక్షించారు. చివరి రోజు శుక్రవారం ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లి గ్రామంలో పర్యటించారు. రైతులు సుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ, చంద్రప్ప, గంగన్నలకు చెందిన వేరుశెనగ పంట, రెయిన్‌గన్ల ద్వారా రక్షక తడులు ఇచ్చే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం అక్కడే విలేఖరులతో మాట్లాడుతూ రెయిన్‌గన్ల ద్వారా మిషన్-1 పంట రక్షక తడులు అందించే విధానాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించామన్నారు. ఇలాంటి ప్రయోగం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంటకు నీరిచ్చి కాపాడామన్నారు. దీంతో మిషన్-1 పంట రక్షక తడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని అన్నారు. ‘అమెజాన్.కామ్ ప్రపంచానే్న మార్చింది. బిల్‌గేట్స్ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ గమనాన్ని మార్చగలిగారు. అలాంటి వినూత్న ఆలోచనల్లో రెయిన్‌గన్ల ప్రక్రియ ఒక ఒరవడి. టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఒక సమస్యను ఏ విధంగా పరిష్కరించవచ్చో చూపించాన’ని సిఎం అన్నారు. ఎన్నికల్లో గెలిచినపుడు కూడా కలగనంత ఆనందం ఈరోజు తనకు కలిగిందని వ్యాఖ్యానించారు. రాయలసీమలో కొందరిది తుపాకుల సంస్కృతి. మాది అలాంటి సంస్కృతి కాదు.. అభివృద్ధి పథం అని అన్నారు. ఇప్పటివరకు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని అనుకున్నారని, ఇక ఎప్పటికీ నీటిఎద్దడి ఉంటుందనుకున్నారు. అలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాను. ఇది రక్షక తడి మాత్రమే. పంట రక్షించడానికే. ఇదే స్ఫూర్తితో రాయలసీమకి నీళ్లు తెస్తామన్నారు. సీమను రాళ్లసీమ కాబోనీమని భరోసా ఇచ్చారు.

చిత్రం... అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లిలో శుక్రవారం రెయిన్‌గన్‌ను
పరిశీలిస్తూ విక్టరీ గుర్తు చూపిస్తున్న సీఎం చంద్రబాబు