ఆంధ్రప్రదేశ్‌

కౌలురైతులకూ భరోసా ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు రూ. 13,500లు ప్రకటించి ప్రారంభించడాన్ని హర్షిస్తున్నామని, అయితే ఈ పథకాన్ని కౌలురైతులకూ వర్తింపజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ గురువారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రామకృష్ణ విలేఖరులతో మాట్లాడుతూ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం తగదన్నారు. మీడియాలో వచ్చే వార్తలు తమకు వ్యతిరేకమని భావిస్తే కేసులు పెడతామనడం పత్రికాస్వేచ్ఛను కాలరాయడమేనని ఆయన నిరసన తెలిపారు.