ఆంధ్రప్రదేశ్‌

డిసెంబర్‌లో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 2 : తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికలు డిసెంబర్‌లోపు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికలు నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య నిర్వహిస్తామని తెలిపారు. కోర్టు ఆదేశానుసారం ఈ ఏడాది డిసెంబర్ కల్లా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కరవు నివారణ చర్యలకు కూడా ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. ఇందులో భాగంగానే వేరు శనగ పంటను పరిరక్షించే చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా రెయిన్ గన్‌ల వినియోగంపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన చేపడుతున్నామన్నారు. ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి రైతులను చైతన్యం చేస్తున్నారన్నారు. ఈ నెల 11 తేదీ నాటికి వేరు శనగ రైతులకు రెయిన్ గన్లు అందిస్తామన్నారు. మున్సిపల్ కార్యాలయాల్లో పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు దృష్టిసారిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కొరత ఉందన్నారు. ఈ నేపథ్యంలో సి ఎస్ ఆర్ నిధులతో ఆయా జిల్లాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి సారిస్తామన్నారు. ప్రస్తుతం పాఠశాల అభివృద్ధికి కేటాయించిన రూ.50 కోట్ల నిధులతో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.