ఆంధ్రప్రదేశ్‌

‘అంగీకార్’పై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 17: అంగీకార్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన అంగీకార్ కార్యక్రమ అమలుపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగీకార్ కార్యక్రమం ద్వారా వ్యర్థాల విభజన, పొగలేని వంటశాల, చెట్లు నాటడం, ఆరోగ్యం, నీటి పొదుపు, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా మెరుగైన సమాజం ఏర్పాటుకు వీలు కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.