ఆంధ్రప్రదేశ్‌

జగన్ పాలన ఎలా ఉంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలన, తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాలపై జనసేన పోలిట్‌బ్యూరో సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. జనసేన పోలిట్‌బ్యూరో సమావేశం శుక్రవారం నాడు హైదరాబాద్ ప్రశాసన్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి మాజీ స్పీకర్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి పీ రామమోహనరావు, జనసేన మైనార్టీ విభాగం కన్వీనర్ అర్హంఖాన్ హాజరైనా మిగిలిన చాలా మంది సీనియర్ నేతలు గైర్హాజరైనట్టు తెలిసింది. యూరప్ పర్యటనలో ఉండటంతో సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్టు రాజు రవితేజ సమాచారం ఇచ్చారని పార్టీ నేత ఒకరు చెప్పారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు, తెలంగాణలో యురేనియం తవ్వకాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పాలనపైనా కూడా విస్తృతంగా చర్చ జరిగింది. మరో పక్క రెండు రాష్ట్రాల్లో జనసేన విస్తరణకు పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తాజా వ్యూహాలను వెల్లడించారు. ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ త్వరలో జరగబోయే అన్ని రకాల ఎన్నికల్లో పోటీకి దిగాలని పార్టీ నేతలు పవన్‌కళ్యాణ్‌కు సూచించారు. వివిధ పథకాల అమలు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు అమలుచేస్తున్న పథకాలపై చర్చించారు. ఆంధ్రాలో జగన్ పాలనపై ఫీడ్‌బ్యాక్‌ను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రజాసమస్యలను గుర్తించి వాటి కోసం వివిధ రూపాల్లో పోరాటాలను ఖరారు చేసుకోవాలని పార్టీ నేతలకు పవన్‌కళ్యాణ్ సూచించారు. పార్టీ నేత ఆకుల సత్యనారాయణ ఫిరాయింపు సహా పార్టీ సీనియర్ నేతలను కాపాడుకునేందుకు నిరంతరం ఏదో ఒక కార్యక్రమాన్ని ఇరు రాష్ట్రాల్లో చేపట్టాలనే ప్రతిపాదన కూడా వచ్చిందని తెలిసింది. 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, రాష్ట్రంలో అన్ని వర్గాల నుండి దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో భవిష్యత్ వ్యూహాన్ని చర్చించారు. అదే విధంగా పలు జాతీయ అంశాలు ప్రధానంగా ఎన్‌ఆర్‌సీ, రామజన్మభూమి అంశంతో పాటు అధికార పక్ష నేతల అవినీతి, అక్రమాలపై దృష్టిసారించాలనే చర్చ కూడా జరిగిందని తెలిసింది. మరో పక్క పక్క సమావేశం ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికింది.