ఆంధ్రప్రదేశ్‌

కుంగిన పోలవరం ప్రాజెక్టు మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, అక్టోబర్ 18: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో మరోసారి రోడ్డు కుంగి బీటలువారింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగింది. ఈ తరహాలో కుంగడం నాలుగోసారి. పాత మామిడిగొంది గ్రామ సమీపంలో వంద మీటర్ల పొడవున మట్టి రోడ్డు బీటలు వారింది. భారీ వర్షాలకు రోడ్డు కుంగివుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు అంచులు సైతం కోతకు గురయ్యాయి. మట్టి రోడ్డు కావడం, పక్కనే లోయవుండటంతో, ఇటీవల కురిసిన వర్షాలకు కుంగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రాజెక్టు పనులు నిలిచిపోవడం, ఆటోలు, ద్విచక్రవాహనాలు రాకపోకలకు అంతరాయం లేకపోవడంతో రోడ్డు కుంగినా ఎవరూ స్పందించలేదు. గతంలో ప్రాజెక్టుకు వెల్లే మార్గంలో పోలవరం గ్రామ సమీపాన 10 అడుగుల మేర ఎత్తులేని బీటలు వారడంతో భూకంపం వచ్చిందేమోననే ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆ తర్వాత స్పిల్‌వే రెస్టారెంటువద్ద, మూడోసారి నిర్మాణ సంస్థ వర్క్‌షాపు వద్ద రోడ్డు బీటలు వారి భూమి కుంగిపోయింది.
భారీ వర్షాలకు ప్రాజెక్టుకు వెళ్లే దారిలో రెండు ప్రదేశాల్లో నీరు నిలబడి, బురదమయం కావడంతో వాహనాలు ఒక్కోసారి బురదలో కూరుకుపోతున్నాయి. అలాగే గోదావరి వరదల కారణంగా ప్రాజెక్టు నుండి 19 లోతట్టు గిరిజన గ్రామాలకు వెళ్లే మార్గం పూర్తిగా పాడైనా మరమ్మతులకు నోచుకోకపోవడంతో దానిపైనే ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు. గోదావరి వరద కారణంగా జూలై 30న ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు, రోడ్డు మరమ్మతులు చేయని కారణంగా ఇప్పటికీ తిరగడంలేదు. ప్రాజెక్టు పనులు జరుగుతుంటే పోలవరం నుండి ప్రాజెక్టుకు వెళ్లే ఐదు కిలోమీటర్ల రోడ్డును కాంట్రాక్టు సంస్థ మరమ్మతులు చేసుకునేది. ప్రస్తుతం ఉన్న నవయుగ సంస్థ స్థానంలో రివర్స్ టెండరింగ్‌లో మెగా సంస్థకు పనులు దక్కినా పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదు. దీనితో ఈ రోడ్డు మార్గాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం తక్షణమే ఈ మార్గానికి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.