ఆంధ్రప్రదేశ్‌

పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులా?: సుజయకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 18: చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పొడిచేలా నిబంధనలను తుంగలో తొక్కుతూ పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేయిస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఆక్షేపించారు. శుక్రవారం ఇక్కడి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్యే మంతెన రామరాజుతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలోని మాతల గ్రామంలో నిర్మించిన సామాజిక భవనానికి వైసీపీ రంగులు వేయడమేమిటని నిలదీశారు. ఆ గ్రామంలో రెండు పంచాయతీ భవనాలు ఉన్నాయని, వాటిలో ఒకదాన్ని గ్రామ సచివాలయంగా వినియోగించుకోవచ్చని, అలాకాకుండా మాజీ ఎమ్మెల్యే నిర్మించిన సామాజిక భవనానే్న గ్రామ సచివాలయంగా మార్చేసి, అందులో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తామంటూనే వైసీపీ రంగులు ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ నిరంకుశ చర్యలకు నిరసనగా గ్రామస్తులతో కలిసి ధర్నా చేస్తూ సీఎం డౌన్, డౌన్ అన్నందుకుగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ సహా 18మంది గ్రామస్తులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమన్నారు. అధికారులు ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా సమర్థిస్తే భవిష్యత్తులో తలెత్తే పరిణామాలకు వారే బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశాలిస్తుంటే అనుభవజ్ఞులైన అధికారులు వాటిని ఎలా అమలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.