ఆంధ్రప్రదేశ్‌

అవకతవకలపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: మహిళా, శిశు సంక్షేమ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తామని ఆ శాఖ మంత్రి తానేటి వనిత ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో తన శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను అధిగమించి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ప్రాథమిక విద్యను అందించే చర్యలను పారదర్శకంగా చేపడుతున్నామన్నారు. గతంలో కోడిగుడ్ల కుంభకోణం, పాడైన ఆహార పదార్థాలను పంపిణీ చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రక్తహీనతతో 53శాతం మంది ప్రజలు బాధపడుతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించిందన్నారు. దాని నుంచి బయటపడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే వారం గర్భిణులు, బాలింతలకు సాయం, అంగన్‌వాడీ కేంద్రాలపై సమీక్ష నిర్వహిస్తానన్నారు. రక్తహీనత సమస్య నుంచి కాపాడేందుకు ప్రణాళికలు తయారుచేసినట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరిన్ని పౌష్టికాహార పదార్థాలు అందించే విషయంపై త్వరలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద అధికారులు రాత్రిపూట బసచేయాలని చెప్పామన్నారు. గతంలో రికార్డుల్లో జరిగిన మార్పుల వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగాన్ని బరువుగా కాకుండా బాధ్యతగా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతినెలా 25వ తేదీకి పౌష్టికాహారం, బాలామృతం వంటివి సక్రమంగా అందడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇక, మద్యం ధరలు పెంచడం ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రానికే లభిస్తుందన్నారు. మద్య నిషేధం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటంపై మహిళలు సంతోషంగా ఉన్నారని మంత్రి వనిత వివరించారు.