ఆంధ్రప్రదేశ్‌

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 18: అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ పైనా ఆంక్షలు విధించడం గర్హనీయమని, ఈవిషయంలో కొడుకు కంటే తండ్రి వెయ్యిరెట్లు బెటర్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరులతో మాట్లాడారు. నూతన ఇసుక పాలసీ పేరుతో కృత్రిమ కొరత సృష్టించి, చివరకు ఇసుక లభ్యమయ్యే గ్రామాల్లో సైతం గడ్డు పరిస్థితులు తెచ్చారని దుయ్యబట్టారు. వైసీపీ అనాలోచిత నిర్ణయం వల్ల 30లక్షల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డునపడి అర్ధాకలితో అలమటించే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్లన్నీ జలకళతో ఉట్టి పడుతున్నప్పటికీ కరెంటు కోతలు తెచ్చి పరిశ్రమలు మూతపడేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మద్యంపై జే-ట్యాక్స్ విధించి ధరలను విపరీతంగా పెంచడంతో పాటు నాణ్యత లోపించిన మద్యాన్ని విక్రయించి ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల ప్రవేశ పరీక్షపత్రాన్ని టైపిస్టులకే అందించి ఫస్ట్ ర్యాంక్‌లు వచ్చేలా చేశారని, అదేమని ప్రశ్నిస్తే ఎదురుకేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలపై రాష్టవ్య్రాప్తంగా దాడులు, దౌర్జన్యాలకు అంతేలేకుండా పోయిందని, తాజాగా జర్నలిస్టులపై కూడా దాడులు ఆరంభమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడామని, మీడియా వాచ్ పేరుతో ఆయన తెచ్చిన జీవో 938ని ఉపసంహరించుకునేలా చేశామని గుర్తుచేశారు. మీడియాపై ఆంక్షల విషయంలో జగన్ కన్నా తండ్రి వైఎస్ వెయ్యిరెట్టు నయమని వ్యాఖ్యానించారు. వైఎస్‌లో హుందాతనం ఉంటే జగన్‌లో అహంభావం ఉందన్నారు. చేసిన తప్పును సకాలంలో రాజశేఖరరెడ్డి దిద్దుకుంటే, జగన్ మాత్రం తనకు ఎదురేలేదనే అహంతో ఏమైనా చేయగలననే గర్వంతో మళ్లీ ఆ జీవోకు పదును పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, చట్టసభలు, కోర్టులు, మీడియా అన్నీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికైనా మీడియాపై ఆంక్షల నిర్ణయాన్ని సీఎం జగన్ విరమించుకోవాలని హితవు పలికారు. ఒకవేళ ముందుకెళ్తే ఆ జీవోనే మీ రాజకీయానికి మరణశాసనం అవుతుందని గుర్తుంచుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.
వైసీపీ కార్యాలయంలా డీజీపీ ఆఫీసు!
డీజీపీ కార్యాలయం వైసీపీ ఆఫీసుగా మారిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నాయకులు వెళితే డీజీపీ ఉండరని, అదే వైసీపీ నేతలు ముగ్గురు వెళితే ఎదురొచ్చి ఆహ్వానం పలుకుతారని విమర్శించారు. డీజీపీ ఆఫీసులోనే మీసాలు మెలేసి టీడీపీ నేతలను హెచ్చరిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇక్కడ టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 14ఏళ్లు ముఖ్యమంత్రిగా, 11ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు డీజీపీ నోటీసు పంపిస్తానని అనడం దేనికి నిదర్శనమని నిలదీశారు. ఎన్ని నోటీసులు పంపిస్తారో పంపించండంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు. వైసీపీ నేతల బారి నుండి తమను తాము కాపాడుకోలేని దుస్థితిలో పోలీసులుంటే ఇక ప్రజలను ఏం కాపాడతారనే చర్చ రాష్టమ్రంతటా జరుగుతోందన్నారు. నెల్లూరులో ముస్లిం జర్నలిస్టుని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ఫోన్‌లో దుర్భాషలాడిన ఆడియో, చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడి కొడుకు కానిస్టేబుల్‌ను దుర్భాషలాడిన ఆడియోను చంద్రబాబు విలేఖరులకు వినిపించారు. ఇవన్నీ డీజీపీకి వినిపించలేదా అని ప్రశ్నించారు. చీరాలలో జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, తునిలో విలేఖరి సత్యనారాయణను కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు.