ఆంధ్రప్రదేశ్‌

బోటు జాడ తెలిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 18: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గత నెల 15వ తేదీన గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీయడానికి భారీ లంగర్లతో నదీ గర్భాన్ని జల్లెడ పడుతున్నారు. గురువారం ఒక లంగరుకు బోటు ఇసుక రెయిలింగ్ చిక్కుకుని బయటకు వచ్చిన సంగతి విదతమే. శుక్రవారం ఒక లంగరుకు బోటులో ఉన్నవారివిగా భావిస్తున్న దుస్తులు చిక్కాయి. మొత్తం మీద ఆ ప్రాంతంలోనే బోటు ఉందనే అంచనాకు రావడంతో బోటు చుట్టూ వలయాకారంలో ఇనుప తాడును వేసి, గాలింపు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఒడ్డుకు 800 అడుగుల దూరంలో 40 అడుగుల లోతున బోటు ఉన్నట్టు దాదాపుగా ఒక నిర్ధారణకు వచ్చారు. అలాగే ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 70 అడుగుల ముందుకు బోటు వచ్చినట్టు గుర్తించారు. నదీ గర్భంలో బోటు ఉందని భావిస్తున్న ప్రాంతంలో చుట్టూ వలయాకారంలో ఇనుప తాడు వేసి మధ్యలో భారీ లంగర్లు వేసి బోటును వెతికే ప్రక్రియ సాగిస్తున్నారు. మెరైన్, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీ ఆర్‌ఎఫ్, పోర్టు, జల వనరుల శాఖ తదితర నిపుణుల ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులు జరుగుతున్నాయని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి శుక్రవారం చెప్పారు. నిపుణులు సూచించిన శాస్ర్తియ విధానంలోనే బోటు వెలికితీత ప్రక్రియ సాగుతోందన్నారు. గురువారం భారీ లంగరుకు బోటు తాలూకు రెయిలింగ్ తగులుకుని బయటకువచ్చిన సంగతి విదితమే. శుక్రవారం లంగరుకు కొన్ని దుస్తులు తగులుకున్నాయి. ఆ దుస్తులను బట్టి బోటులో మృతదేహాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ధర్మాడ సత్యం బృందం బోటు చుట్టూ ఇనుప రోప్ వలయాకారంలో వేసి బోటును వెలికి తీసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వేసిన లంగరు ఒకటి బయటకు వచ్చేసిందని ధర్మాడ సత్యం చెప్పారు. నదీ గర్భంలోకి ఆక్సిజన్ సిలిండర్‌తో వెళ్ళి బోటుకు లంగరు తగిలించి వెలికితీయడం, మరోవైపు రెండు వైపులా లంగర్లు వేసి, పైకి ఎత్తి లాగడం వంటి విధానాలను అనుసరించడంపై కూడా యోచిస్తున్నారు. అయితే బోటు తక్కువ లోతులోనే వుంది కాబట్టి డైవర్స్‌ను దింపితే బావుంటుందని ఆలోచన చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకుని లోపలికి వెళ్ళి వలయాకారంలో ఇనుప రోప్‌ను చుట్టి బురదలోంచి పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాదంలో గల్లంతైనవారి ఆచూకీ కోసం బంధువులు నిరీక్షిస్తున్నారు.
ఇంకా 11 మంది జాడ తెలియాలి : కలెక్టర్
బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 40 మృతదేహాలను గుర్తించి, బంధువులకు అప్పగించామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రమాద సమయంలో బోటులో 77 మంది ఉన్నారన్నారు. 51 మంది గల్లంతయ్యారని, ఇప్పటి వరకు 40 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో 11 మంది జాడ తెలియాల్సి వుందన్నారు. బోటును వెలికి తీయడానికి నిపుణుల కమిటీతో చర్చించి, వారి సలహా మేరకు శ్రీ బాలాజీ మెరైన్ సంస్థకు పనులు అప్పగించామన్నారు. ధర్మాడ సత్యంతో పాటు బోటును రెండు గంటల్లో వెలికి తీస్తామని చెప్పిన మత్య్సకారుడు శివ కూడా బోటు వెలికితీత పనుల్లో ఉన్నాడన్నారు. ధర్మాడ సత్యం బృందానికి సహాయపడటానికి కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ కచ్చులూరు వెళ్ళారన్నారు. గురువారం బోటును కనుగొని లంగరు వేయగా, బోటు రెయిలింగ్ మాత్రమే వచ్చిందని, యధావిధిగా వెలికితీత పనులు కొనసాగుతున్నాయన్నారు. ధర్మాడ సత్యం అనుసరిస్తున్న పద్ధతిలోనే బోటు వెలికితీత పనులు జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.