ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో సీఆర్‌ఎం బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 18: ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, నిధుల ఖర్చు, జమ వివరాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కామన్ రివ్యూ మిషన్(సీఆర్‌ఎం)ప్రతినిధుల బృందం శుక్రవారం విశాఖ జిల్లాలో పర్యటించింది. దీనిలో భాగంగా ఎనిమిది మంది ప్రతినిధుల బృందం ముందుగా ఆంధ్రా మెడికల్ కళాశాలలో జిల్లాలో ఆరోగ్య శాఖ పరంగా చేపడుతున్న విధి విధానాలు తదితర వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. కేజీహెచ్‌లోని అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం, వార్డుల్లోని రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేజీహెచ్ గైనిక్, పీడియాట్రిక్, ఆర్థో, నెఫ్రాలజీ వార్డుల్లో రోగులతో ముచ్చటించారు. విశాఖ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్, రీజనల్ ట్రైనింగ్ సెంటర్స్, కేజీహెచ్ నర్సింగ్ హాస్టల్స్ నిర్వహణ, నేషనల్ హెల్త్ మిషన్‌లో మంజూరైన నిధుల జమ, ఖర్చు వివరాలను అకౌంటింగ్ అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, ఏడుగురు సభ్యుల బృందం కేజీహెచ్‌తో పాటు, నగరంలోని బోధనాసుపత్రులు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సీఆర్‌ఎం కమిటీ ప్రతినిధుల బృందం, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుపతిరావు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్, ట్రైనింగ్ సెంటర్స్ ఇన్‌చార్జి డాక్టర్ పీఎస్ సూర్యనారాయణ, రాష్ట్ర ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ దేవి, తదితరులు పాల్గొన్నారు.