ఆంధ్రప్రదేశ్‌

20న ఏపీ సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 18: లెక్చరర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందేందుకు నిర్వహించే రాష్టస్థ్రాయి అర్హత పరీక్ష (ఏపీసెట్-2019)ను ఈ నెల 20న నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తెలిపారు. విశాఖ ఏయూ సెనేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ సెట్ పరీక్షకు ఈ ఏడాది 34,020 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, 30 సబ్జెకులకు ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి యూజీసీ అనుమితిచ్చిందన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నామని, విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతీయ కేంద్రాల్లో 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ప్రాంతీయ కేంద్రాల అధికారులను ఆదేశించామన్నారు. ఏపీ సెట్ పరీక్షకు సంబంధించి రెండు పేపర్లు ఉంటాయని, వీటిలో పేపర్-1 పరీక్షను అక్టోబర్ 20న ఉదయం 9.30గంటల నుంచి 10.30 గంటల వరకూ, పేపర్-2 పరీక్షను 11గంటల నుంచి 1గంట వరకూ నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అయితే ఈ ఏడాది ఏపీ సెట్ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకొకుండా ఓఎంఆర్ షీట్లు, బార్ కోడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ పరీక్షకు ఎటువంటి నెగిటివ్ మార్కులు లేవని, పరీక్ష సమయానికి గంట ముందుగా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, దివ్యాంగ అభ్యర్థులకు అదనపు సమయం కేటాయించామన్నారు. ఏపీ సెట్ మెంబర్ కన్వీనర్ ఆచార్య కె.శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, మీడియా రిలేషన్స్ డీన్ ఆచార్య పి.బాబీ వర్దన్ పాల్గొన్నారు.