ఆంధ్రప్రదేశ్‌

ఇక విజయవాడ నుంచే హజ్‌యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదల వల్లే 2020 హజ్‌యాత్ర విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి సాధ్యమైందని, గన్నవరం విమానాశ్రయం నుంచే హజ్‌యాత్రకు వెళ్లాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపునిచ్చారు. 48గంటల ముందు హజ్ క్యాంప్‌కు వచ్చే యాత్రికులకు అవసరమైన వసతి, భోజనం, తదితర అన్ని సదుపాయాల్ని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలో భాగంగా హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సంవత్సరాదాయం 3లక్షల కంటే తక్కువగా వున్నవారికి 60వేల రూపాయలు, 3లక్షల కంటే ఎక్కువ ఉన్నవారికి 30వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోందని ఆయన తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ‘2020-హజ్‌యాత్ర’ సమాచారానికి సంబంధించి కరపత్రం, గోడపత్రికను విడుదల చేసి ఆయన ప్రసంగించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఇలియాస్ రిజ్వీ, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మతపెద్దలు పాల్గొన్నారు.