ఆంధ్రప్రదేశ్‌

పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, అక్టోబర్ 18: పారిశ్రామిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను వచ్చే రెండు నెలల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో శుక్రవారం జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో రజత్ భార్గవ్ మాట్లాడుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ఏకకాలంలో వివిధ శాఖల అనుమతులతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకువచ్చే ఔత్సాహికులకు సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లా స్థాయిల్లోనే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం వంటి వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి వహిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. తిరుపతిలో ఆదిదాస్ గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థ యాజమాన్యం ముందుకు వచ్చిందని, తద్వారా 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతపురం జిల్లాలో ప్రముఖ జాకీ గార్మెంట్ సంస్థ యాజమాన్యం తమ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. చైనాలో పరిశ్రమ ఏర్పాటులో ఆ దేశం అవలంభిస్తున్న వైఖరి వల్ల దాదాపు 150 ప్రముఖ పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు చెప్పారు. ఇందులో వియత్నాంకు దాదాపు 20 శాతం పైగా పరిశ్రమలు వెళ్లిపోయాయన్నారు. అయితే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి చేపట్టిన చర్యల వల్ల ఎంతో మంది పారిశ్రామికవేత్తలు వివిధ దేశాల నుండి తమ సంస్థల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇకపోతే విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ద్వారా వెనుకబడిన అనంతపురం జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. హిందూపురం పట్టణానికి ప్రత్యేకంగా ఓ క్లస్టర్ మంజూరయిందన్నారు. రాష్ట్రంలో మూడు కొత్త పోర్టులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అనంతపురం, కర్నూలు, దొనకొండ విమానాశ్రయాలను ఆధునీకరించడం ద్వారా పారిశ్రామిక వేత్తలు ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా విద్యుత్, నీరు వంటి సదుపాయాలు ముందుగా కల్పించి వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికరంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, రాయదుర్గం, కల్యాణదుర్గం, గుంతకల్లు, హిందూపురం ప్రాంతాల్లో క్లస్టర్ల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఏపీఐఐసీ కమిషనర్ సుబ్రహ్మణ్యం, సబ్ కలెక్టర్ నిశాంతి, ట్రైనీ కలెక్టర్ జాహ్నవి, ఎపీఐఐసీ మేనేజర్ చంద్రవౌళి పాల్గొన్నారు.