ఆంధ్రప్రదేశ్‌

పీటీసీలో సౌకర్యాలు మెరుగు పరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 18: దేశ భద్రతకు పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రైనింగ్) ఎన్ సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ పోలీస్ శిక్షణ కళాశాలలో అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ మెగా రక్తదాన శిబిరాన్ని ఐజీ సతీమణి ఎన్.మహిత చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఐజీ సంజయ్ విలేఖరులతో మాట్లాడుతూ సమాజంలో పోలీసుల భూమికను భావితరం వారికి తెలియజేసేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల భావితరం విద్యార్థులకు పోలీసుల ప్రాధాన్యతను గుర్తించడమే కాకుండా పోలీసుల పట్ల పాజిటివ్ దృక్పథం కలిగే అవకాశం ఉందన్నారు.
అంతేగాకుండా పోలీస్ సామగ్రి, పోలీస్ విధులు, టెక్నాలజీ ఎలా ఉపయోగిస్తారనే అంశంపై ప్రజలకు వివరిస్తున్నామన్నారు. అలాగే పోలీస్ కుటుంబ సంక్షేమం ఎలా ఉందని తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదిలా ఉండగా పోలీసు శిక్షణ కళాశాలలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. ఫైరింగ్ రేంజి, ఫీల్డ్ క్రాఫ్ట్ ట్రైనింగ్‌కు ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పీటీసీని అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనలు ఎంత వరకు వచ్చాయని అడగ్గా ఇక్కడ మరిన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తామని, విజయవాడలో అప్పా (ఏపీ పోలీస్ అకాడమీ) ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉందని వివరించారు. పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజు, వైస్ ప్రిన్సిపాల్ మెహర్‌బాబు, ఎస్పీ బి.రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.