ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వంపై ఆక్రోశమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆక్రోశం ఎందుకని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఐదు నెలలే అయిందని గుర్తుచేశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చంద్రబాబు పత్రికా స్వేచ్ఛ, వివేకానంద రెడ్డి హత్యపై మాట్లాడుతున్నారన్నారు. అవాస్తవాలతో ప్రచురించిన వార్తలపై చర్యలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై తమకు గౌరవం ఉందన్నారు. ప్రతిపక్షం జగన్ పాలనను సహించలేక పోతోందన్నారు. 40ఏళ్ల అనుభవం ఉన్నా చంద్రబాబుకు రాని సంక్షేమ ఆలోచనలు యువ సీఎంకు రావడం సహించలేక పోతున్నారన్నారు. తాను ఇంకా ముఖ్యమంత్రి అనే భ్రమలోనే ప్రతిపక్ష నేత ఉన్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనివిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆయన ఛిద్రం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.