ఆంధ్రప్రదేశ్‌

ఉపాధ్యాయులకు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), సెప్టెంబర్ 3: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలువురు ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి అవార్డులను ఇవ్వనుంది. సెప్టెంబర్ 5న మాజీ రాష్టప్రతి సర్వేపల్లి రాధకృష్ణ జయంతితో పాటు ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా విద్యాభివృద్ధిలో అత్యుత్తమంగా నిలిచిన ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుండి జివిఎస్‌ఆర్ అంజనేయులు, నూర్ భాషా అబ్దుల్, విశాఖ ఆంధ్రాయూనివర్సిటీ నుండి ఇఎ నారాయణ, యు ఫీమామ్, జివిఆర్ శ్రీనివాసరావు, ద్రవిడ యూనివర్సిటీ కుప్పం నుండి ఎన్ కనకరత్నం, అనంతరపురం జెఎన్‌టియు నుండి సి శశిధర్, కాకినాడ జెఎన్‌టియు నుండి జివిఆర్ ప్రసాద్‌రాజు, జి స్వామి నాయుడు, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటి నుండి సి సురేష్‌కుమార్, ఆర్ విజయకృష్ణ నాయుడు, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటి నుండి కె భారతి, ఎస్ జ్యోతి, తిరుపతి ఎస్వీ యూనివర్సిటి నుండి కె శేషయ్య, పి మల్లిఖార్జున్, బి రామచంద్రారెడ్డి, తిరుపతి వెంకటేశ్వర వెటర్నటీ యునివర్సిటి నుండి ఆర్‌వి సురేష్ కుమార్, పి ఈశ్వరప్రసాద్, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్సిటి నుండి జహీబ్ బానో, వెంకటేశ్వర యూనివర్సిటి ఆఫ్ మెడికల్ సైన్స్ తిరుపతి నుండి బిసిఎం ప్రసాద్, వి శివకుమార్, ఆచార్య నాగార్జున ఆగ్రికల్చర్ యూనివర్సిటి నుండి కె నిర్మల్వ్రికుమార్, ఎస్‌ఆర్ కోటేశ్వరరావు, సిహెచ్‌వివి సత్యనారాయణ, కర్నూలు రాయలసీమ యూనివర్సిటి నుండి ఎస్ మధుసూదనరావు, కడప యోగివేమన యూనివర్సిటి నుండి జి గులామ్‌లను యూనివర్సిటి విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. అలాగే ఆర్ట్స్ అండ్ యుమానిటిస్ విభాగంలో కె రత్న షీలమయి, ఎస్ ప్రసన్నలను, సోషల్ సైన్స్ విభాగంలో ఎం కోటేశ్వరరావు, బి రత్నకుమారి, కామర్స్ మరియు మేనేజ్‌మెంట్ విభాగంలో జె కాత్యాయని, లా విభాగంలో ఎల్ జయశ్రీ, లైఫ్ సైన్స్ విభాగంలో ఎజె సల్మాన్ రాజ్, ఫిజికల్ సైన్స్ విభాగంలో ఆర్‌విఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్, ఇంజనీరింగ్ విభాగంలో ఎం షాషి, ఫార్మసీ విభాగంలో వై రాజేంద్రప్రసాద్, ఆగ్రికల్చర్ విభాగంలో వి రాధాకృష్ణమూర్తి, వెటర్నటీ విభాగంలో వి వైకుంఠరావును కమిటీ ఉత్తమ పరిశోధకులుగా ఎంపిక చేసింది. వీటితో పాటు ఎఫిలియటెడ్ విభాగానికి సంబంధించి తెలుగు కోసం టి రామచంద్రారెడ్డి, ఇంగీష్‌కు ఎస్ మహబూబ్, సాంస్కృతం విభాగంలో డిఎన్ ధీక్షితులు, హిందీలో పికె జయలక్ష్మి, పొలిటికల్ సైన్స్‌లో ఎసిఆర్ దివాకర్ రెడ్డి, ఎకనామిక్స్ విభాగంలో జికెఎస్ వెరొనికా, హిస్టరీలో విబిటి సుందరి, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో టి నారాయణ, ఎపి జగనాధ్నం, డి శ్రీనివాసరావు, బోటనీలో ఎస్‌ఎస్ స్వామి, జూవలజీలో వి సుబాషిణీ, బయోకెమిస్ట్రీలో సిహెచ్ శ్రీనివాస ప్రసాద్, కెమిస్ట్రీలో కెఎఆర్‌ఎస్‌ఎస్ ప్రసాద్, మాథమెటిక్స్ విభాగంలో ఎ గంగాధర్‌లను ఎంపిక చేశారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉపాధ్యయ దినోత్సవం రోజు సన్మానించనుంది.