ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ నాయకుల వ్యాఖ్యలు పట్టించుకోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 19: పోలీసులపై రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్షలు జరుగుతున్నప్పుడు కొందరిని కలవడం కుదరకపోవచ్చని, అలాంటి చిన్న విషయాలకే డీజీపీ అందుబాటులో లేరంటే ఎలా అంటూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇటీవల ఓ రాజకీయ పార్టీ నాయకులు సవాంగ్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలు పురస్కరించుకుని శనివారం ఏర్పాటు చేసిన కార్యాక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరుల త్యాగాలను మరువలేమన్నారు. రహదారి భద్రత, సిటిజన్ సర్వీస్ సెంటర్, డ్రోన్స్, టెక్నాలజీ, డయల్ 100, క్లూస్ టీమ్స్ తదితర విషయాలపై రాష్టవ్య్రాప్తంగా విద్యార్థులకు అవగాహన కలిగించామన్నారు. అమరవీరుల స్మరణార్థం రాష్టవ్య్రాప్తంగా 10వేల మంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. పోలీసులకు విక్లీ ఆఫ్‌లపై త్వరలోనే ఒక యాప్‌ను విడుదల చేస్తున్నామని, హోంగార్డులకు ఏపీలోనే అత్యధిక వేతనం అందిస్తున్నామన్నారు. దీంతో 40లక్షల మందికి పైగా హోంగార్డుల కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో తాను ఇతర కార్యాక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల కలవలేకపోయానని, అయినా వారు ఇచ్చిన ఫిర్యాదు మీడియాతో పాటు సామాజిక మాద్యమాల ద్వారా తనకు ముందుగానే వచ్చిందన్నారు. తాను వినయపూర్వకమైన ఒక ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమేనని తనకు తెలిసిందల్లా ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయడమేనన్నారు.
*చిత్రం...రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్