ఆంధ్రప్రదేశ్‌

ఒడిదుడుకులను తట్టుకుంటేనే బంగారు భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, అక్టోబర్ 19: ఐదు రాష్ట్రాల్లో వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ప్రముఖ రచయిత, మనో విశే్లషక నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 రాష్ట్రాల్లో దాదాపు వెయ్యి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఒడిదుడుకలను తట్టుకునేవారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. తెలుగు భాషతోపాటు ఇతర భాషలపై పట్టు సాధించేందుకు కృషి చేయాలన్నారు. జీవితంలో అవకాశం ఒకసారే వస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రులు కీలకపాత్ర పోషించాలన్నారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల లోపం ఉంటే వారి జీవితాలు నాశనమవుతాయన్నారు. టీవీ, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడి చాలామంది విద్యార్థులు భవిష్యత్‌ను దెబ్బ తీసుకుంటున్నారన్నారు. చదువు ఫ్యాషన్‌గా మారిందని, పరీక్ష పాసవ్వడం కోసమే కాదని, అన్ని రంగాల్లో పట్టుసాధించేందుకు, జ్ఞానం పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. 70కు పైగా పుస్తకాలు రాశానని, ఇందులో వెనె్నల ఆడపిల్ల, తులసీదళం, అంతర్ముఖం, తదితర పుస్తకాలకు మంచి పేరు వచ్చిందన్నారు. సమావేశంలో తాండ్రపాపారాయ విద్యాసంస్థల అధినేత తూముల భాస్కరరావు పాల్గొన్నారు.

*చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న ప్రముఖ రచయిత, మనోవిశే్లషణ నిపుణుడు యండమూరి