ఆంధ్రప్రదేశ్‌

సెక్రటేరియట్ వద్ద ఆందోళనలు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 3: ఏపి కొత్త సచివాలయం వద్ద ఆందోళనల పర్వం మొదలైంది. గత రెండురోజులుగా మంత్రులు ఎడతెగని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం విశ్వవిద్యాలయాలపై మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదే సందర్భంలో యూనివర్సిటీ ఉద్యోగ సంఘాల నాయకులు, పలువురు అధ్యాపకులు మంత్రులకు వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి చేరుకున్నారు. రాష్టవ్య్రాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో స్క్రీనింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రుల పేషీల ముట్టడికి యత్నించారు. మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చిన అనంతరం పెద్దఎత్తున నినాదాలు చేస్తుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తుండగా సచివాలయ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఉద్యోగ నేతలను వారించారు. అసలు మిమ్మల్ని లోపలకు ఎవరు అనుమతించారంటూ అక్కడే ఉన్న ఓ అధికారి వారిని బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. మంత్రుల ఆదేశాల మేరకు 15 మంది ఉద్యోగ నేతలు, అధ్యాపకులను పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

చిత్రం..కొత్త సచివాలయం వద్ద శనివారం మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా యూనివర్శిటీ ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యాపకులు వినతిపత్రం ఇచ్చేందుకు వారిని పోలీసులు అడ్డగించడంతో ఆగ్రహంతో నినాదాలిచ్చారు.