ఆంధ్రప్రదేశ్‌

ప్రజా సేవలో అమరవీరులే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 20: పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ప్రజలకు సేవల్లో మరింత అంకితభావంతో పనిచేస్తామని డీజీపీ దామోదర గౌతం సవాంగ్ ఉద్ఘాటించారు. ప్రజలకు ప్రశాంత జీవనాన్ని కల్పించేందుకు పోలీసులు ప్రాణత్యాగానికి సైతం వెనుకాడరని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న తాము అత్యంత విలువైన రక్తదానం చేస్తూ విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. వారం రోజులుగా జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో రాష్టవ్య్రాప్తంగా 5వేల మంది పోలీసులు రక్తదానం చేశారన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్టస్థ్రాయి మెగా రక్తదాన శిబిరాన్ని డీజీపీ ఆదివారం ప్రారంభించారు. శిబిరంలో రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన పోలీసు విభాగాల్లోని 600 మంది సిబ్బంది, పౌరులను ఆయన అభినందించారు. కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించిన సవాంగ్ రక్తదానం చేసిన ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. సామాజిక బాధ్యతగా పోలీసు అమరవీరుల పట్ల వారు కనపరిచిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విధినిర్వహణలో దేశం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం పోలీసులు అత్యంత విలువైన తమ ప్రాణాలను అర్పించడంతో సహా అనేక త్యాగాలు నిత్యం చేస్తూనే ఉన్నారన్నారు. వారందరికీ హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. అలాంటి అమరుల స్ఫూర్తితో ప్రజలకు మరింత అంకితభావంతో సేవ చేస్తామని, శాంతిభద్రతల పరిరక్షణకు తమ జీవితాలనే పణంగా పెట్టిన అమరవీరుల త్యాగాలను ఎల్లప్పుడూ మననం చేసుకుంటూనే ఉంటామన్నారు. పోలీసు యూనిఫారంతో నేడు పనిచేస్తున్న తమకు అమరుల త్యాగనిరతి నిరంతరం స్ఫూర్తినిస్తుందన్నారు. విధుల్లోని తాము ప్రజల కోసం ఇంకా ఏంచేయగలమనే ఆలోచన నుంచి వచ్చిందే రక్తదానమని చెప్పారు. ప్రాణాపాయంలో ఉన్నవారికి మేమున్నామంటూ మా రక్తాన్ని సైతం అందిస్తున్నామన్నారు. వారం రోజులుగా రాష్టవ్య్రాప్తంగా రక్తదానం చేసిన 5వేల మంది పోలీసుల స్ఫూర్తితో మరో 9వేల మంది పౌరులు రక్తదానం చేశారని తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు రక్తదానం చేయడం తమకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో సమాజానికి, ప్రజలకు మరింత సేవ చేస్తామని, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో రాష్టవ్య్రాప్తంగా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల్లో భాగస్వాములైన ప్రజలకు డీజీపీ సవాంగ్ ధన్యవాదాలు తెలిపారు.
*చిత్రం... విజయవాడలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి పరిశీలిస్తున్న డీజీపీ గౌతం సవాంగ్