ఆంధ్రప్రదేశ్‌

జిల్లాలకు కొత్త ఇన్‌చార్జి మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తాజాగా జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, మార్పులతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని), విజయనగరం జిల్లాకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, విశాఖ జిల్లాకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, తూర్పు గోదావరి జిల్లాకు పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పశ్చిమ గోదావరి జిల్లాకు రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), కృష్ణా జిల్లాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుంటూరు జిల్లాకు గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రకాశం జిల్లాకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ని నియమించింది. నెల్లూరు జిల్లాకు ఇంధన, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూల్ జిల్లాకు ఇరిగేషన్ శాఖ మంత్రి పి అనిల్ కుమార్, కడప జిల్లాకు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అనంతపురం జిల్లాకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్తూరు జిల్లాకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డిని ఇంచార్జి మంత్రులుగా ప్రభుత్వం నియమించింది. ఆరు నెలల వ్యవధిలోనే ఇన్‌చార్జి మంత్రులను మార్చడం గమనార్హం.