ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ చార్జీల సవరణకు రెగ్యులేటరీ కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) చార్జీలను త్వరలోనే పెంచే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సూచనప్రాయంగా వెల్లడించారు. డీజిల్ ధరలు, ఇతర ఖర్చులు పెరిగినా 2015 నుంచి ఆర్టీసీ చార్జీలు పెంచలేదని ఆయన గుర్తుచేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్, డిపోలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఆర్టీసీ చార్జీల ఖరారుకు ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ తరహాలో బస్ ఫేర్ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు ముసాయిదా బిల్లును సిద్ధంచేశామని, త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. సంస్థ ఆదాయ, వ్యయాలను బట్టి స్వతంత్రంగా పనిచేసే ఈ కమిషన్ చార్జీలను ఖరారు చేస్తుందని వివరించారు. ఆర్టీసీకి రోజుకు రూ.100 కోట్ల నష్టం వస్తోందన్నారు. సంస్థ రోజుకు 30కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోందని, 2015నుంచి ఇప్పటివరకు డీజిల్ ధరలు లీటరుకు రూ.36 పెరిగిందన్నారు. దీనివల్ల సంస్థకు రూ.780 కోట్ల
నష్టం వస్తోందన్నారు. పెంచిన జీతాల వల్ల మరో రూ.600 కోట్ల భారం పడుతోందన్నారు. 78శాతం ఆక్యుపెన్సీ రేటుతో ఏపీఎస్‌ఆర్టీసీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. 5.2 కెఎంపిఎల్‌తో బస్సులు నడుపుతోందన్నారు. ఏపీ, మహారాష్టల్ల్రోని ఆర్టీసీల నిర్వహణపై ప్రపంచబ్యాంకు అధ్యయనం చేస్తోందని, వారి సలహాలు, సూచనల మేరకు మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి బస్సులు, డ్రైవర్ల సంఖ్యను, రూట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో 2వేల మంది డ్రైవర్ల కొరత ఉందన్నారు. ఏటా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలుచేయాలని నిర్ణయించామని కృష్ణబాబు వెల్లడించారు. పాత బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతామన్నారు. తొలిదశలో 350 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేశామని, వీటిని తిరుపతి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నంలో నడుపుతామన్నారు. మలి దశలో మరో 650 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. ఎలక్ట్రికల్ బస్సుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఒక్కో బస్సుపై రూ.55 లక్షల సబ్సిడీ అందిస్తోందన్నారు. విజయవాడ, విశాఖపట్నం, విజయవాడల్లో ఎలక్ట్రికల్ సిటీ బస్సులు నడుపుతామన్నారు. ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కృష్ణబాబు స్పష్టం చేశారు. ఆర్టీసీకి సరుకుల రవాణా ద్వారా ఏటా రూ. 70కోట్ల ఆదాయం లభిస్తోందని, దీన్ని మరింత బలోపేతం చేసి, రానున్న రెండేళ్లలో రూ.200 కోట్ల ఆదాయాన్ని సాధించడానికి కృషిచేస్తామన్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే చర్యల్లో భాగంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఆర్టీసీ బస్టాండ్లు, కాంప్లెక్సులను అభివృద్ధిచేసి, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇతర వాణిజ్య భవనాలు నిర్మిస్తామన్నారు. తిరుపతి బస్టాండును విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తామన్నా. రాజమహేంద్రవరం బస్టాండ్‌ను కూడా అభివృద్ధిచేసే అవకాశం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త రవాణా చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కృష్ణబాబు తెలిపారు. సమన్వయంతో ఈ చట్టాన్ని అమలు చేయాల్సి ఉందన్నారు. కొత్త చట్టంలో కొన్ని అపరాథాలకు కేంద్రమే జరిమానాలను ఖరారు చేసిందని, 11 అంశాల్లో రాష్ట్రాలకు స్వేచ్చనిచ్చిందని, మరికొన్ని నిబంధనల అమలుకు కమిటీని ఏర్పాటుచేసిందని కృష్ణబాబు వివరించారు.
*చిత్రం...రాజమహేంద్రవరం బస్ కాంప్లెక్సును పరిశీలిస్తున్న ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు