ఆంధ్రప్రదేశ్‌

విపత్తుల నివారణకు పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మార్చి 25: ప్రకృతి విపత్తుల నుండి లోకాన్ని కాపాడుకోవడం కోసం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో పూజలు, యాగాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ ధర్మాదాయశాఖ అస్థాన జ్యోతిష్యుడు శ్రీపాద శ్రీవల్లభ మహాపీఠం వ్యవస్థాపకుడు పూజ్యం విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన సింహగిరిపై విలేఖరులతో మాట్లాడారు. విపత్తులను ముందుగా గ్రహించే వ్యవస్థ జ్యోతిష్య శాస్త్రంలో ఉందని అన్నారు. జ్యోతిష్య శాస్త్రం మూడు విభాగాలపైనే అందరికీ అవగాహన ఉందని, అత్యంత ప్రధానమైన సంహిత భాగం ప్రాచుర్యంలోకి రావలసిన అసరం ఉందని అన్నారు. గ్రహాల గమనాన్ని బట్టి భవిష్యత్తులో వచ్చే పరిణామాలను సంహిత భాగం ముందుగానే గుర్తిస్తుందన్నారు.
సంహిత భాగంపై తాను పదిహేనేళ్లు పరిశోధన చేసినట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 27 నుండి మే 15 మధ్య భారీ గాలులతో తుపాను వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రధాన దేవాలయాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని ఉద్యానవనాల్లో దేవాతా వృక్షాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అరిష్ట యోగాలను శాంతింప చేయడం కోసం ఆలయాల్లో యాగాలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.