ఆంధ్రప్రదేశ్‌

నాటుసారాపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మద్యపాన నిషేధం, నాటుసారా నిర్మూలనపై ఎక్సైజ్ శాఖ కొరఢా ఝళిపిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 688 కేసులు నమోదు చేసి 1002 మందిని అరెస్టు చేశారు. నాటుసారా విషయంలో 208 కేసులు నమోదు చేసి 518 నిందితులను అధికారులు అరెస్టు చేశారు. 9858.44 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని 2,49,217 లక్షల లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి 63 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలకు సంబంధించి 480 కేసులు నమోదు చేసి 484 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి 5996.115 లీటర్ల మద్యం, 1020.04 లీటర్ల బీరు, 19వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యాని (ఎన్‌డీపీ)కి సంబంధించి 124 కేసులు నమోదు చేసి 123 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి 146.85లీటర్ల మద్యం, 14.83 లీటర్ల బీరు, 26 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా నిర్మూలనకై రాష్ట్రంలోని 13 జిల్లాల్లో టాస్క్ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ పి హరికుమార్ ఈసందర్భంగా తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారుల ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఎస్పీలకు నాటు సారా రవాణా, విక్రయాలకు అవకాశం ఉన్న గ్రామాల గురించి సమాచారాన్ని ఇప్పటికే అందచేశారు. ఇక రానున్న వారం రోజులకు సంబంధించి మద్యపాన నిషేధం, నాటుసారా నిర్మూలనలో భాగంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను అన్ని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లకు జారీ చేశారు.