ఆంధ్రప్రదేశ్‌

23న మరో అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/విశాఖపట్నం : దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సోమవారం తెలిపారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలియచేసిందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల దృష్ట్యా వర్ష ప్రభావ జిల్లాల అధికారులను అప్రమ్తతం చేశారు. తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.