ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్ విద్యలో సమూల సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 21: రాష్టవ్య్రాప్తంగా ఇంటర్మీడియట్ విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపడుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 80 శాతం ప్రైవేట్ కళాశాలలే కొనసాగుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే ఇంటర్మీడియట్ రెగ్యులేటరీ కమిషన్ వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు చేపట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ కళాశాలల పనితీరును పరిశీలించి నోటీసులు ఇచ్చారని, కళాశాలల్లో వౌలిక వసతులు, విద్యా విధానం, నాణ్యతా ప్రమాణాలు, తరగతి గదులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారన్నారు. రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల ఆర్‌ఐఓలతో సమీక్షా సమావేశాలు నిర్వహించామన్నారు. చాలా చోట్ల డిస్‌ప్లే బోర్డులు లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్టవ్య్రాప్తంగా సుమారు 13 వందల కళాశాలల్లో 700 విద్యా సంస్థలకు ఇప్పటికే నోటీసులు అందించటంతో పాటు ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించారని వివరించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన ఒకే రంగుతో కూడిన బోర్డులు మాత్రమే ఏర్పాటు చేయాలని అందులో కళాశాల పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, కోర్సుల వివరాలను అందుబాటులో ఉంచాలని, ఇతర వివరాలు ఏర్పాటు చేయరాదనే నిబంధన ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. 2013 తరువాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇంటర్మీడియట్ బోర్డు సమావేశం కాకపోవటంపట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లాలో 50 శాతానికి పైగా కళాశాలలను రకరకాల పేర్లతో ఒకే సంస్థ అక్రమంగా నిర్వహిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కళాశాలలన్నింటికీ నోటీసులు ఇచ్చామని, పది రోజుల్లో నిబంధనల మేరకు నడుచుకునేలా చూస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై తొలుత అపరాధ రుసుం కింద రూ. 10వేలు వసూలు చేస్తామని అప్పటికీ మార్పు రాకపోతే కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి ఉన్న కోర్సులను మాత్రమే కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సైన్స్ కోర్సులు నిర్వహించే కళాశాలలు తప్పనిసరిగా ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన ప్రయాణసౌకర్యాల కల్పనకు కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు ఆర్‌ఐఓలుగా మూడేళ్ల కాలపరిమితితో ఒకే చోట పనిచేస్తున్నందున ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకమైందన్నారు. ఆర్‌ఐఓల పనితీరును మదింపుచేసి తదనుగుణంగా కొనసాగించే అంశం పరిశీలనలో ఉందన్నారు. విద్యా క్యాలెండర్ తరగతుల నిర్వహణ, సమయం, సెలవులు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని వచ్చే ఏడాది నుంచి నూతన విధానం అమల్లోకి వస్తుందన్నారు. ప్రైవేట్ లెక్చరర్ల సమస్యలపై ప్రభుత్వం నిర్దిష్టమైన విధానాన్ని త్వరలో వెలువరిస్తుందని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫిర్యాదులను స్వీకరించేందుకు ఆన్‌లైన్‌లో ఓయుర్‌బీఐఈపీ అట్ ది రేటాఫ్ జీమెయిల్‌తో పాటు వాట్సాప్ నెంబర్ 9391282578 అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసి సిలబస్‌లో మార్పులు తీసుకురావటంతో పాటు ఫీజుల నియంత్రణ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా సంస్కరణలు అమలు చేస్తామన్నారు. ఇంటర్ ఫస్టియర్‌కు రూ. 4470, ద్వితీయ సంవత్సరానికి రూ 4783 మాత్రమే నిబంధనల ప్రకారం చెల్లించాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. జూనియర్ లెక్చరర్ల నియామకాలను త్వరలే చేపడతామని ప్రకటించారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ పెండింగ్‌లో ఉన్నాయని అందువల్ల నేరుగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే చట్టాలను సవరించి సంస్కరణలు చేపడతామని స్పష్టం చేశారు.
*చిత్రం...రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్